అమల రెండో పెళ్లి నిజం కాదట!


తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసబెట్టి సినిమాలు చేసింది. ఈ సమయంలోనే హిందీ గాయకుడు భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో పడిందని సమాచారం. వారి డేటింగ్ గురించి ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

భవీందర్‌ను అమల రహస్యంగా వివాహం చేసుకుందంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల గురించి తాజాగా ఓ తమిళ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల స్పందించింది. తను రెండో పెళ్లి చేసుకున్నానన్న వార్త నిజం కాదని స్పష్టం చేసింది. తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ కోసం రూపొందించిన యాడ్ సందర్భంగా ఆ ఫొటోలు తీశారని తెలిపింది. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసబెట్టి సినిమాలు చేసింది. ఈ సమయంలోనే హిందీ గాయకుడు భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో పడిందని సమాచారం. వారి డేటింగ్ గురించి ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.