ఒక మంచి ట్వీట్‌ చేసిన వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక సెన్షేషన్‌ కోసం లేదంటే తన సినిమాల పబ్లిసిటీ కోసం ట్వీట్స్‌ చేస్తూ ఉంటాడు. ఆయన ఏ ట్వీట్‌ చేసినా ముక్కు సూటిగా చాలా క్లీయర్‌గా సుత్తి లేకుండా ఉంటుంది. తను ఎవరిని టార్గెట్‌ చేశాడో వారికి ఆ ట్వీట్‌ తగిలేలా ఉంటుంది. ఇప్పుడు వర్మ చేసిన ట్వీట్‌ జనాలందరికి తగింది. ఈసారి ఆయన చేసిన ట్వీట్‌ ప్రజల శ్రేయస్సు కోసం అవ్వడంతో అంతా కూడా ఆయన్ను అభినందిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత వర్మ ఒక మంచి ట్వీట్‌ చేశాడని ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించడం లేదంటూ సామాజిక బాధ్యతతో కూడిన ట్వీట్‌ ను చేశాడంటూ నెటిజన్స్‌ ప్రవంసలు కురిపించారు. ఇంతకు వర్మ చేసిన ట్వీట్‌ ఏంటీ అంటే… నిన్న సాయంత్రం 5 గంటలకు డాక్టర్లకు, వైధ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ క్లాప్స్‌ కొట్టారు. నేడు ఉదయం 5 గంటలకు అవన్నీ మర్చి మళ్లీ యధావిధిగా రోడ్ల మీదకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఏమాత్రం భయపడకుండా జనాలు ఇలా రావడం కరెక్ట్‌ కాదంటూ వర్మ హెచ్చరించాడు.

నిన్నంతా కూడా స్వచ్చందంగా నిర్భందంలో ఉన్న జనాలు నేటి నుండి లాక్‌ డౌన్‌ ప్రకటించినా కూడా పట్టించుకోకుండా అలాగే జనాలు తిరుగుతున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా జనాలు మాత్రం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. మరో వైపు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. ఇండియాలో, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వర్మ చెప్పినట్లుగా ఇంటికి పరిమితం అవ్వడం మంచిది.