కష్టాల్లో ఉన్న నాగశౌర్యకే మరో కష్టం

ఛలో చిత్రంకు ముందు తర్వాత హీరో నాగశౌర్యకు పెద్దగా సక్సెస్‌ లు లేవు. ముఖ్యంగా ఈమద్య కాలంలో ఈయన చాలా అంచనాల నడుమ నటించిన అశ్వథ్థామ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. దాదాపుగా పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా కనీసం అయిదు కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది అంటూ ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషించారు. అంతటి దారుణ పరాభవం చవిచూసిన నాగశౌర్య ఇటీవలే లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సినిమాకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే.

కొత్త దర్శకురాు అయిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సినిమా ప్రారంభం అయ్యింది. నాగశౌర్యకు జోడీగా రీతూ వర్మను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. షూటింగ్‌ షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్‌కు వెళ్లాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్‌లో ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. కాని ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ ప్రారంభం అయ్యేది అనుమానమే అంటూ ప్రచారం జరుగుతోంది.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య స్క్రిప్ట్‌ విషయంలో నిర్మాతలు సూచించిన మార్పులను చేర్పులను చేసేందుకు ఒప్పుకోవడం లేదట. పూర్తిగా ఆమె కంట్రోల్‌లోనే సినిమా ఉండాలని పట్టుబడుతుందట. ఆమె పట్టుదల కారణంగా నిర్మాత హర్ట్‌ అయ్యాడని అందుకే సినిమానే వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. నాగవంశీ ప్రాజెక్ట్‌ను వదిలేస్తే నాగశౌర్యకు ఎలాగూ సొంత బ్యానర్‌ ఉంది కనుక ఆ బ్యానర్‌లో సినిమాను నిర్మించవచ్చు అనుకుంటున్నారట. అశ్వథ్థామ చిత్రంతో చాలా నష్టపోయిన నాగ శౌర్య ఫ్యామిలీ మళ్లీ ఆ సాహసం చేస్తుందా. పాపం ఇప్పటికే ఫ్లాప్స్‌లో ఉన్న నాగ శౌర్యకు ఇది మరో కష్టమా అంటూ ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.