క‌రోనా ఎఫెక్ట్‌…అంట్లు తోముకుంటోన్న మ‌ల్లీశ్వ‌రి


స్టార్ హీరో, హీరోయిన్స్‌ను మ‌నం చూసిన‌ప్పుడ‌ల్లా వీరేం ఇంటి ప‌నిచేస్తారు? సినిమా షూటింగ్స్ త‌ర్వాత ఖాళీగా ఎంజాయ్ చేస్తార‌నుకుంటే.. అస‌లు వీళ్ల‌కి ఇంటి ప‌ని చేయడం తెలుసా? అనే సందేహం కూడా క‌లుగుతుంది. కానీ క‌రోనా వైర‌స్‌ ముందు మేం కూడా సామాన్యుల‌మే.. సాధార‌ణ మ‌నుషుల‌మే అని చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి ప‌క్క మ‌నుషుల‌తో మాట్లాడ‌టానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు.

ఇక స్టార్స్ విష‌యానికి వ‌స్తే వారు ప‌ని మ‌నుషుల‌ను కూడా ఇంట్లోకి రానివ్వ‌డం లేదు. బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కూడా స్వీయ నిర్భంధంలో ఉంది. ఉండ‌ట‌మే కాదు.. ఇంటి ప‌నుల‌ను చ‌క్క‌గా చేసుకుంటోంది. అంట్లు తోముకుంటోంది. క‌త్రినా అంట్లు తోముతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. తాను అంట్లు ఎలా తోముతానో అనే విష‌యాన్ని క‌త్రినా ఆ వీడియోలో చెప్పింది.