టబుపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతితో పాటు బాలీవుడ్ లో వున్న నెపోటిజమ్ దేశ వ్యాప్తంగా జరుగతున్న పలు వివాదాస్పద అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. శివసేన నాయకులపై విరుచుకుపడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంగన పంజాబ్ రైతుల వివాదంపై కూడా స్పందించి వార్తల కెక్కింది. వివాదాస్పద అంశాలే కాకుండా ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు దక్షిణాది హిట్ లపై కూడా స్పందిస్తోంది.

రీసెంట్ గా కన్నడ హీరో రిషబ్శెట్టి నటించి తెరకెక్కించిన ‘కాంతార’ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన కంగన.. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఇందులో నటించి దర్శకత్వం వహించిన రిషబ్శెట్టిని ప్రశంసల్లో ముంచెత్తింది. చివరి 15 నిమిషాలు రోమాంచిత అనుభూతిని కలిగించిందిని వా వాటే మూవీ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. దక్షిణాది సినిమాలని చూసి బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలంటూ విమర్శలు చేసింది.

బీటౌన్ జనాలు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలుచుకుంటున్న కంగన తాజాగా సీనియర్ హీరోయిన్ టబుపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’తో పాటు పలు సినిమాపై కామెంట్ లు చేసిన కంగన తాజాగా టబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. 50 ఏళ్ల వయసులోనూ టబు ఒంటి చేత్తో హిందీ చిత్రసీమని బతికిస్తోందని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా స్టోరీస్ లో ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది.

‘ఈ ఏడాది రెండు హిందీ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నాయి. అవి ‘భూల్ భులయ్యా 2’ రెండు ‘దృశ్యం 2′. ఈ రెండు సినిమాల్లో సూపర్ స్టార్ టబు ప్రధాన పాత్రలో నటించారు. ఆమె 50 ఏళ్ల వయసులో ఒంటరిగా హిందీ చిత్ర పరిశ్రమను కాపాడింది.

ఆమె ప్రతిభను ఎవరు ఎప్పుడు ప్రశించలేదు. అయినా 50 ఏళ్ల వయసులోనూ స్టార్ గా నిలవడం మాత్రం అద్భుతం అని చెప్పాలి. మహిళలు తమ పని పట్ల అంచంచలమైన అంకితభావానికి ఇంకా ఎక్కువ క్రెడిట్ కు అర్హులని నేను భావిస్తున్నాను. ఆమె ఎంతో మందికి స్ఫూర్తి’ అంటూ పేర్కొంది కంగన.

కంగన ప్రస్తుతం ఇందిరా గాంధీ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ మూవీలో నటిస్తూ తానే తెరకెక్కిస్తోంది. ఈ మూవీకి కంగననే నిర్మాత కూడా. ఇటీవల రిలీజ్ చేసిన కంగన ఇందిర లుక్ కు విశేష స్పందన లభించిన నేపథ్యంలో సినిమా ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలై సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేస్తోంది.