టెర్రిఫిక్ బ్లాక్ బస్టర్ గా ‘మసూద’..!

గత వారాంతంలో విడుదలైన ‘మసూద’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు చాలా నెమ్మదిగా ప్రారంభమైన ఈ చిత్రం.. ఆ తర్వాత నుంచి రోజురోజుకూ గత రోజు కంటే ఎక్కువ వసూలు చేస్తూ రన్ అవుతోంది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మసూద’ సినిమా 6 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. బుధవారము వంటి సాధారణ వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ప్రతి రోజూ గ్రోత్ నమోదు చేస్తూ వచ్చింది.

నైజాంలో 6వ రోజు 35 లక్షల నెట్ కలెక్షన్స్ అందుకున్న ‘మాసూద’.. ఈ ఆరు రోజుల్లో 2.10 కోట్ల నెట్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలానే ఆంధ్రా ప్రాంతంలోనూ ఈ చిత్రానికి మంచి నంబర్స్ నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.

‘మాసూద’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కోట్ల వరకూ వసూలు చేసినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఈరోజు గురువారం కూడా మరిన్ని కలెక్షన్స్ యాడ్ అవుతాయనిపిస్తోంది. ఇది మేకర్స్ తో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కు లాభదాయకమైన వెంచర్ అని చెప్పాలి.

‘మళ్ళీ రావా’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా.. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ”మాసూద” చిత్రాన్ని నిర్మించారు. ఎస్విసి సంస్థ ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేసారు.

ఈ హారర్ థ్రిల్లర్ సినిమాతో సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో సంగీత – తిరువీర్ – కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు.

టెర్రిఫిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ‘మసూద’ చిత్రాన్ని ఇప్పుడు చెన్నైలో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ రేపు నవంబర్ 25 నుంచి ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. తమిళనాట ఈ చిత్రం ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.