డెస్టినేషన్ కాదు.. సింపుల్‌గా నితిన్ పెళ్లి


హీరో నితిన్ పెళ్లి, తను ప్రేమించిన షాలినీతో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగాల్సి ఉంది. దుబాయ్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి ఉంటుందని ఇప్పటికే తెలిపి ఉన్నారు. అలాగే పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో ఏప్రిల్ 21న గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించాలని ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇప్పుడు నితిన్ పెళ్లి చాలా సింపుల్‌గా జరపాలని ఇరు కుటుంబాలు భావించినట్లుగా తెలుస్తుంది.

ఏప్రిల్ 16న నితిన్ వివాహం తనకు కాబోయే భార్య ఇంటి వద్ద.. హైదరాబాద్‌లో అతి తక్కువ మంది సమక్షంలో జరపాలని నిర్ణయించారట. ఈ పెళ్లికి ఇతరులెవరినీ ఆహ్వానించడం లేదని, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నితిన్, షాలినీ కుటుంబ సభ్యులు చెబుతున్నార