నాగచైతన్య నెక్స్ట్.. రియల్ స్టోరీనా?

నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ నిరుత్సాహాపరిచింది. అయితే చైతూ ఈసారి తన నెక్ట్స్ సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దీని కి నిర్మాతగా బన్నీ వాసు వ్యవహారిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయట కు వచ్చింది.

ఇక ఈ సినిమా గుజరాత్ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రాసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాగ చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రేమకథ తో పాటు ఎమోషన్స్ యాక్షన్స్ ఎలివేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. ఉప్పెన తరహాలో సముద్రం బ్యాక్ డ్రాప్ ఉంటుందని టాక్.

ఇక ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇంత భారీ మొత్తం చైతు కెరీర్ లో హయ్యెస్ట్ ఇదే అవుతుందని తెలుస్తోంది.

కథ డిమాండ్ చేయడంతో ఆ మేరకు అల్లు అరవింద్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. బ్యాక్ డ్రాప్ ని బట్టి చూస్తే నాగ చైతన్య ఇందులో ఎక్కువ శాతం గళ్ళచొక్కా చారల పంచతో కనిపించబోతున్నారని.. ఊర మాస్ లుక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. 2018 మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఈ సినిమా గురించి మాట్లాడటంతో… ఈ ఇంట్రెస్టింగ్ అప్టేట్స్ బయట కు వచ్చాయి.

ఇక చైతూ ఫ్యాన్స్ కూడా కస్టడీ ఫ్లాప్ తో నిరాశలో ఉన్నారు. ఎందుకుంటే.. చైతుకి వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. థ్యాంక్యూ లాల్ సింగ్ చడ్డా కస్టడీ ఇలా హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇక నెక్ట్స్ మూవీ పై భారీగానే అంఛనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కథ కథనం బాగుందని ఈసారి హిట్టు ఖాయమని భావిస్తున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్టేట్స్ అయితే ఇప్పట్లో లేనట్లే కనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.