పిక్‌ టాక్‌: హాలీవుడ్‌ యాక్షన్‌ గర్ల్‌.!

0
14

బ్రిటిష్‌ గర్ల్‌ అయినా అమీ జాక్సన్‌ ఇండియన్‌ సినిమాల్లో సత్తా చాటుతోంది. తెలుగులో ‘ఎవడు’ సినిమాలో నటించిన అమీ జాక్సన్‌, తమిళంలో ‘మదరాసి పట్టణం’, ‘ఐ’ తదితర సినిమాల్లో నటించిన విషయం విదితమే. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది అమీ జాక్సన్‌. తన తాజా చిత్రం ‘రోబో 2.0’లో తన లుక్‌ని విడుదల చేస్తూ, అమీ జాక్సన్‌ ‘ఈ ఫొటో కోసం నేనెంత ఉత్కంఠగా ఎదురుచూశానో నాకే తెలుసు..’ అంటూ చెప్పుకొచ్చింది.

లుక్‌ చూస్తే, అమీ జాక్సన్‌ అంత ఉత్కంఠగా ఎందుకు ఎదురు చూసిందో అర్థమవుతుంది. హాలీవుడ్‌ యాక్షన్‌ గర్ల్‌ని తలపించేలా వుంది కదూ.! కాదు కాదు, లేడీ రోబో అన్పించేస్తోంది కదూ.! అదీ కరెక్టే, ఇదీ కరెక్టే.! యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో తన టాలెంట్‌ ఏంటో అమీ ఇప్పటికే ఓ బాలీవుడ్‌ సినిమాతో ప్రూవ్‌ చేసేసుకుంది. ఈ ‘2.0’లో అయితే అంతకు మించి యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో సత్తా చాటేసిందట అమీ జాక్సన్‌.

రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. తమిళ దర్శకుడు శంకర్‌ ఈ ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇంతవరకు ఏ హీరోయిన్‌ ఈ స్థాయిలో యాక్షన్‌ గర్ల్‌గా కన్పించలేదేమో.. అనేంతలా వుంది కదూ అమీ జాక్సన్‌ గెటప్‌.!