ప్రభాస్ అంటే పడిచస్తోంది! పదే పదే పెళ్లి కావాలంటోంది?!

బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది కృతి సనోన్. ఇటీవల విడుదలైన `మిమీ` విజయం తర్వాత ఈ బ్యూటీ స్పీడ్ మరింత పెరిగింది. తాజాగా వరుణ్ ధావన్ సరసన నటించిన `భేదియా` విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. కృతి టైగర్ ష్రాఫ్ తో యాక్షన్ చిత్రం గణపత్ లో… ప్రభాస్ సరసన బహుభాషా పాన్-ఇండియన్ చిత్రం `ఆదిపురుష్` లోను నటిస్తోంది.

ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ షూటింగ్ లో ఉన్న కృతి సనన్ గత ఏడాది ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తన కోస్టార్ ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని బహిరంగాంగానే చెప్పింది. ప్రముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్- టైగర్ ష్రాఫ్- కార్తీక్ ఆర్యన్ లలో ఎవరితో సరసాలాడుతారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని కృతిని ప్రశ్నించారు. దానికి కృతి తటపటాయించకుండానే సమాధానమిచ్చింది.“కార్తీక్ తో సరసాలాడుతాను… టైగర్ తో డేటింగ్ చేస్తాను.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను“ అని సమాధానం ఇచ్చింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.

కృతి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అమ్మాయిలు బాహుబలి ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు దశాబ్ద కాలంగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. బాహుబలి విజయం తర్వాత ఇండియా లెవల్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులరయ్యాడు. అతనికి 8000 కంటే ఎక్కువ ప్రపోజల్స్ కూడా యువతుల నుంచి వచ్చాయి.

కానీ ప్రభాస్ పై రకరకాల రూమర్లు షికార్ చేసాయి. అతడు బాహుబలి కోస్టార్ అనుష్కను పెళ్లాడుతాడని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఈ జంట విషయంలో ఉత్తరాది మీడియా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పెళ్లి వరకూ వెళ్లారని కూడా కథనాలు వండి వార్చింది. ఇక ఇటీవల ఆదిపురుష్ చిత్రీకరణ సమయంలో కృతి సనోన్ తో ప్రభాస్ సాన్నిహిత్యం గురించి బోలెడంత చర్చ సాగింది. ముఖ్యంగా ఆదిపురుష్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి కృతి ప్రభాస్ పై కన్నేసిందని అతడిని పెళ్లాడేయాలని కలలు గంటోందని ప్రచారమైంది. దానికి తగ్గట్టుగా ప్రచార వేదికలపైనా ప్రభాస్ కి చేదోడు వాదోడుగా ఎంతో లాలనగా కనిపించింది. డార్లింగ్ కాలికి దెబ్బ తగిలి కుంటుతుంటే చేయి అందించి నడిపించింది. చెమట పడుతుంటే తుడుచుకునేందుకు తన కొంగునే అందించింది. అంత ప్రేమగా ఇక ఏ హీరోయిన్ ప్రభాస్ ని చూసుకోలేదేమో! అందుకే ఈ జోడీ మధ్య ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపించాయి. అప్పటికే ప్రభాస్ పై క్రష్ ఉందని తనని పెళ్లాడేస్తానని కృతి బహిరంగంగానే ప్రకటించింది గనుక కచ్ఛితంగా ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని మీడియాతో పాటు అభిమానులు ఊహిస్తున్నారు.

ఇంతలోనే ఇప్పుడు మరోసారి కృతిసనోన్ భేదియా (తెలుగులో తోడేలు) ప్రచారంలో మరోసారి అదే విషయాన్ని ప్రస్థావించింది. తనకు ఏమాత్రం అవకాశం చిక్కినా ప్రభాస్ ని పెళ్లాడేస్తానని ప్రకటించింది. గతంలోలానే కార్తీక్ తో సరసం.. టైగర్ తో డేటింగ్.. చేస్తానని చెప్పిన కృతి ప్రభాస్ ని మాత్రం పెళ్లాడుతానని ప్రముఖ మీడియాతో వ్యాఖ్యానించింది. మొత్తానికి లైఫ్ లాంగ్ సెటిలైతే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితేనే పర్ఫెక్ట్! అని బలంగా ఫిక్సయినట్టే కనిపిస్తోంది. ఇక “డార్లింగ్ (ప్రభాస్) పరిచయంతో అంతా మారిపోయింది“ అంటూ వరుణ్ ధావన్ సైతం బేధియా ప్రచారంలో కృతిపై జోక్ చేయడంతో ఇప్పుడు అది కూడా ఫైర్ యాడెడ్ టు ది పెట్రోల్ అన్న చందంగా మారింది. కృతి పదే పదే ప్రభాస్ ని పెళ్లాడేస్తానంటూ వెంటపడుతోంది. బహిరంగంగా ప్రతిదీ ఓపెన్ అయిపోతోంది. కృతి పెళ్లాడేస్తుంది సరే.. అందుకు డార్లింగ్ ప్రభాస్ ఓకే చెప్పాలి కదా? అదేమీ అంత వీజీ కాదు!!

ప్రభాస్- కృతి జంటగా నటించిన ఆదిపురుష్ గురించి చెప్పాలంటే.. ఈ చిత్రంలో కృతి సనన్ సీతగా నటించగా..ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ డ్రామాకి పురాణేతిహాసం రామాయణం స్ఫూర్తి. రావణుడిగా ఇందులో సైఫ్ ఖాన్ నటించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వి.ఎఫ్.ఎక్స్ తో తెరకెక్కుతోంది. గ్రాఫిక్స్పై పని చేయడానికి అవతార్ – స్టార్ వార్స్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన VFSX సూపర్ వైజర్ లను సంప్రదించారని వార్తలొచ్చాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో వీఎఫ్ ఎక్స్ పై తీవ్రమైన కామెంట్స్ వచ్చాక మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని బడ్జెట్ కూడా పెరిగిందని కథనాలొచ్చాయి.