ప్రాణాల కు తెగించి కష్టపడటం వల్లే ఈ వందల కోట్ల కలెక్షన్స్

కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా లో అధా శర్మ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యోగితా బిహానీ సిద్ధి ఇద్నానీ సోనియా బలానీ కీలక పాత్రలో కనిపించారు.

అమాయకు లైన కేరళ అమ్మాయిల ను లవ్ జిహాద్ పేరు తో మత మార్పిడి చేసి ఆపై ఉగ్రవాద కార్యక్రమాల కు ఉపయోగించుకోవడం.. వారిని దేశ వ్యతిరేకులుగా మార్చడం.. ఆ తర్వాత వారు చేసే పనులు.. ఇలాంటి అంశాలతో కూడిన కథతో సినిమా ను రూపొందించడం జరిగింది.

సినిమా కు వచ్చిన పబ్లిసిటీ మరియు పాజిటివ్ కారణంగా ఇప్పటి వరకు 230 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూళ్లు సాధించిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా లోని కీలక సన్నివేశాల కోసం ఏకంగా మైనస్ 16 డిగ్రీల చలిలో దాదాపు రెండు రోజుల పాటు కష్టపడ్డామని హీరోయిన్ పేర్కొంది.

డీ హైడ్రేషన్ కారణంగా తన పెదవులు పగిలి పోయాయని.. రాళ్లలో కిందపడే సన్నివేశాలు సహజంగా చేయడం కోసం చాలా దెబ్బలు తగిలించుకున్నానని కేరళ స్టోరీ సినిమా షూటింగ్ అనుభవాల ను హీరోయిన్ మీడియాతో పంచుకుంది.

అదే సందర్భంలో ఆమె అప్పటి వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో షేర్ చేసుకుంది. కేవలం వివాదం కారణంగానే భారీగా కలెక్షన్స్ వచ్చాయి అని కొందరు అనుకుంటే పొరపాటని.. తాము ఈ స్థాయిలో కష్టపడ్డాము కనుక సినిమా వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని యూనిట్ సభ్యులు మరియు హీరోయిన్ పేర్కొంది.