ప్రోమో: PSPK (X) NBK నవ్వుల కుంభవృష్టి ఆహా

NBK అన్ స్టాపబుల్ సీజన్ 2 అదరగొడుతోంది. ఇటీవల వరుసగా టాప్ సెలబ్రిటీలతో బాలయ్య బాబు ఇంటర్వ్యూలు ‘ఆహా’ ఓటీటీలో దుమారం రేపాయి. ఇప్పుడు వాటన్నిటికీ మించిన మరో ఎపిసోడ్ దూసుకొస్తోంది. ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్’ లో నందమూరి బాలకృష్ణ చాట్ షోకి మరింత మాస్ అప్పీల్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ని బరిలో దించింది ఆహా బృందం.

టాలీవుడ్ పవర్ స్టార్.. ఆరడుగుల బుల్లెట్టు పవన్ కళ్యాణ్ తో ఎన్.బి.కే ఎపిసోడ్ అన్ స్టాపబుల్ పంచ్ లు కామెడీతో అలరించనుంది. ఇప్పటికే రిలీజైన తొలి టీజర్ జెట్ స్పీడ్ తో నందమూరి మెగాభిమానుల్లో వైరల్ అయ్యింది.

యూట్యూబ్ లో రికార్డు స్థాయి వీక్షణలతో దూసుకెళ్లింది. తాజాగా మరికాస్త డీటెయిలింగ్ తో మరో ఛమక్కు లాంటి ప్రోమోని ఆహా విడుదల చేసింది.

ఈ ప్రోమో(టీజర్) ఆద్యంతం పవన్ తో బాలయ్య బాబు హాస్య చతురత మైమరిపింపజేసింది. ముఖ్యంగా ఎన్బీకే తన సహచర నటుడు సమకాలికుడైన కాంపిటీటర్ మెగాస్టార్ చిరంజీవిని ఎంతో గౌరవించి మాట్లాడుతూ తన హుందాతనాన్ని చాటుకున్నారు. మీ అన్నయ్య చిరంజీవి నుంచి మీరు నేర్చుకున్నదేంటి? వద్దనుకున్నదేమిటీ? అనే ఠిఫికల్ ప్రశ్నను అడిగారు.

మీ అన్నయ్య చిరంజీవి గారికి ఉన్న అశేష జనాదరణ ఫాలోయింగ్ ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదు? అంటూ హోస్ట్ బాలయ్య బాబు పవన్ ని ప్రశ్నించారు.

వీటన్నిటికీ పవన్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. పవర్ స్టార్ గురించి మనకు తెలియనివి తెలియాల్సినవి ఈ ఎపిసోడ్ లో తెలుస్తాయని ఆహా ప్రకటించింది.