ఫోటోటాక్ : మెగా డాటర్ కమర్షియల్ హీరోయిన్ ఫోజ్

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క వారసురాలు నిహారిక కొణిదెల. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాయి. దాంతో నటనకు దూరం అయ్యింది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు పూర్తిగా దూరం అవుతుందని అంతా భావించారు. కానీ నటన జోలికి వెళ్లకుండా నిర్మాతగా నిహారిక సినిమాలు మరియు సిరీస్ లు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కొననసాగుతూ ఉంటుంది. ఆమె వరుసగాచేస్తున్న ఫోటో షూట్స్ మరియు వీడియోలు ఆమె ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుతుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హీరోయిన్ రేంజ్ లో నిహారిక ఫోటోలకు ఫోజ్ లు ఇవ్వడం చూసి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో నిహారిక అందాల ఆరబోత ఇంతకు ముందు పెద్దగా లేదు. కానీ ఈ ఫోటో షూట్ నుండి అందాల ఆరబోత ను ఆశించవచ్చేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇక నుండి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా నిహారిక యొక్క ఫోటో షూట్స్ ను చూడబోతున్నామేమో అనే చర్చ జరుగుతోంది.

నిహారిక మరియు నాగబాబు రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో లేదా ఫోటో తో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా కూడా ఒక ఫన్నీ వీడియోను వీరు షేర్ చేయడం జరిగింది. ఒక వైపు నాన్న తో క్యూట్ వీడియోలను షేర్ చేస్తూ నిహారిక ఇక నుండి ఇలా హాట్ ఫోటో షూట్స్ ను కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.