బన్నీ తీరు దిల్ రాజుకు నచ్చట్లేదా?

అగ్ర నిర్మాత దిల్ రాజు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఎందుకంటే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు కావొస్తోంది. ఇంకా అల్లు అర్జున్ మాత్రం ఏ విషయం తేల్చట్లేదు. బన్నీ ఒప్పుకున్నాకే సినిమాను అనౌన్స్ చేసారు కానీ బన్నీ మాత్రం సినిమాకు డేట్స్ ఇవ్వట్లేదు.

ఐకాన్ తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఐకాన్ వాయిదా పడుతూ వస్తోంది. దిల్ రాజు అడిగితే మాత్రం చూద్దాం, చేద్దాం అనే అంటున్నాడు కానీ అంతకు మించి ఒక్క మాట కూడా రావట్లేదట. “కథ నచ్చకపోయినా, డేట్ల సమస్య ఉన్నా చెప్పాలి కానీ ఇలా నాన్చడం మాత్రం బాలేదు” అని దిల్ రాజు సన్నిహిత వర్గాల వద్ద వాపోయినట్లు సమాచారం. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ పై నమ్మకంగానే ఉన్నాడు దిల్ రాజు.