బాబోయ్‌ పూరి: బాలయ్య భజన టూమచ్‌.!

0
10

బాలయ్య హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా ఖరారవ్వడంతోనే పూరి, బాలయ్యకు వీరాభిమానిగా మారిపోయాడు. షూటింగ్‌ సమయంలో బాలయ్యను దగ్గరగా చూసిన పూరి, బాలయ్యలోని ‘గొప్పతనాన్ని’ చాలా బాగా అర్థం చేసేసుకున్నాడు. అంతే, అందరికన్నా తానే బాలయ్యకు పెద్ద అభిమానినంటూ చెప్పేసుకున్నాడు. అంతేనా, బాలయ్య తన అభిమాని చెంప పగలగొడితే అదొక లవ్‌ స్టోరీ.. అని తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించి అందర్నీ విస్మయానికి గురిచేశాడు పూరి జగన్నాథ్‌.

‘పైసావసూల్‌’ సినిమా ఫలితం ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమాన హీరోతో ఛాన్స్‌ని పూరి జగన్నాథ్‌ ఎంత దారుణంగా చేజార్చుకున్నాడన్న విషయమై ఎవరెలా చెప్పుకుంటున్నాసరే, బాలయ్య మాత్రం పూరిని ఇంకా గట్టిగానే నమ్ముతున్నాడట. ఆ సంగతి పక్కన పెడితే, పూరి తన కుమారుడు ఆకాష్‌తో ‘మెహబూబా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేయగానే, పూరి తనయుడ్ని స్వయంగా కలిసి అభినందించాడు బాలయ్య. అంతేనా, ‘మెహబూబా’ షూటింగ్‌ ప్రారంభించడానికి ముహూర్తాన్ని కూడా బాలయ్యే ఫిక్స్‌ చేశాడట.

ఇది మరీ టూ మచ్‌ కదూ.! దటీజ్‌ పూరి జగన్నాథ్‌. బాలయ్య మీద పూరి జగన్నాథ్‌కి ఆ స్థాయిలో అభిమానం వుండడం తప్పేమీ కాదుగానీ, బాలయ్య అభిమానినంటూ పూరి ‘వాడకం’ హద్దులు దాటేస్తోంటే, అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది మరి. అన్నట్టు, ‘పైసావసూల్‌’ నిరాశపర్చినా, పూరి – బాలయ్యతో మరో సినిమా చేస్తానని ఇంతకు ముందే ప్రకటించిన విషయం విదితమే.