‘బాలయ్య ఎన్టీఆర్’ క్లయిమాక్స్ అదే

0
12

రెండు ఎన్టీఆర్ బయోపిక్ లకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ హడావుడి ఎక్కువగా వుంది. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ హడావుడి కనిపించడం లేదు. కానీ అలా అని ఏర్పాట్లు జరగడం లేదని కాదు. జెట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయి. ఎంత స్పీడ్ లో అంటే ఏ మాత్రం అవకాశం వున్నా జనవరి 18న టీజర్ వదిలేంత స్పీడులో.

ఈ సినిమాకు సాయి కొర్రపాటి, సిసిఎల్ విష్ణు, బాలయ్య నిర్మాతలుగా వుంటున్నారు. బాలయ్య బ్యానర్ పేరు ఇంకా ఫిక్స్ కాలేదు. దర్శకుడు తేజకు నామినల్ అండ్ రీజనబుల్ రెమ్యూనిరేషన్ ప్లస్, లాభాల్లో చిన్న షేర్ ఫిక్స్ చేసి, వారాహి సంస్థ నుంచి అడ్వాన్స్ అందేసింది. ప్రస్తుతానికి తేజ కాకుండా ఫిక్స్ అయిన టెక్నీషియన్ ఒక్క సంగీత దర్శకుడు కీరవాణి మాత్రమే. ఈ నెలాఖరులోగా మిగిలినవన్నీ ఫిక్స్ చేస్తారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ చాలా జెన్యూన్ గా వుంటుందని, ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తుపల్లాలు అన్నీ వుంటాయని తెలుస్తోంది. కానీ స్క్రిప్ట్ ఆయన బాల్యంతో ప్రారంభమై, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటను ఢీకొని, మళ్లీ అధికార సింహాసనం అధిరోహించడంతో పూర్తవుతుంది.

సినిమా క్లయిమాక్స్ నాదెండ్ల ఉదంతం, దానిపై పోరాటం అన్నమాట.