మంచి లైనప్ తో యంగ్‌ హీరో దూకుడు

తమిళ స్టార్‌ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తీ. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియారే అనే సినిమాలో కార్తీ నటిస్తున్న విషయం తెల్సిందే.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకం ను మేకర్స్ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు.

వా వాతియారే సినిమా విడుదలకు ముందే కార్తీ 30వ సినిమాకు సంబంధఙంచిన చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు తమీజ్‌ దర్శకత్వంలో కార్తీ సినిమా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

తమిళ మీడియాలో ప్రముఖంగా ఈ విషయమై కథనాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్న కార్తీ 30 సినిమా ను 1960 నాటి పరిస్థితుల్లో రూపొందించబోతున్నారట. పీరియాడిక్ డ్రామాగా విభిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తమీజ్ రూపొందించబోతున్నాడు.

కార్తీ వా వాతియారే, తమీజ్‌ సినిమాలతో పాటు పీఎస్ దర్శకత్వంలో సర్దార్‌ 2 ను చేసేందుకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఆ సీక్వెల్‌ ప్రారంభం అవ్వబోతుంది. ఇక ఖైదీ 2 ను ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. మొత్తానికి మంచి లైనప్‌ తో కార్తీ దూసుకు పోతున్నాడు.