మోసం హీరోయిన్ దా? ద‌ర్శ‌క‌నిర్మాత‌దా?

న‌టి పాయ‌ల్ రాజ్ పుత్- ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌ధీప్ ఠాకూర్ మ‌ధ్య వివాదం తీవ్ర స్థాయిలో న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘ర‌క్ష‌ణ‌’ సినిమా విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం ముదిరింది. పారితోషికం విష‌యంలో నిర్మాత త‌న‌ని మోసం చేసాడంటూ పాయ‌ల్ చేసిన ఆరోప‌ణ ఏకంగా హైద‌రాబాద్ నుంచి ముంబై వ‌ర‌కూ చేరింది. నిర్మాత చెల్లించా ల్సిన బకాయి ఎగ్గొట్టాడ‌ని పాయ‌ల్ రాజ్ పుత్ ఆరోపిస్తే ర‌ణ‌వీప్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేసాడు.

అక్క‌డ నుంచి ముంబై ఫిలిం పెడ‌రేష‌న్ కి కూడా వెళ్లింది. పాయ‌ల్ రాజ్ పుత్ తన‌వైపు నుంచి ముంబై పెడ‌రేష‌న్ కంప్లైట్ ఇచ్చింది. ఇదంతా జ‌రిగి కొన్ని రోజులు గ‌డిచింది. అయితే ఈ సినిమా నేడే విడుద‌లైంది. ఈ సినిమా ప్ర‌చారంలో ఎక్క‌డా పాయ‌ల్ క‌నిపించ‌లేదు. మెయిన్ లీడ్ పోషించిన పాయ‌ల్ రాజ్ పుత్ ఆమె ప్ర‌చారం చేయ‌కుండానే `ర‌క్ష‌ణ` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో నిర్మాత వెర్ష‌న్ కూడా తాజాగా తెర‌పైకి వ‌చ్చింది.

`ఈ సినిమా కోసం పాయ‌ల్ 47 రోజులు ప‌ని చేసింది. ఒప్పందం ప్ర‌కారం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలి. ప్ర‌మోష‌న్ కి వ‌స్తే ఇవ్వాల్సిన 6 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పాం. కానీ ఆమె ప్ర‌చారానికి రాలేదు. 20 ల‌క్ష‌లు ఇస్తే వ‌ర్చువ‌ల్ గా సినిమాని ప్ర‌మోట్ చేస్తాన‌ని ఆమె మేనేజ‌ర్ సౌర‌బ్ ధింగ్రా చెప్పారు. దీనిపై కూడా నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు చేసాను. తాను ప్ర‌మోష‌న్ కి రాక‌పోయినా త‌న‌కి చెల్లించాల్సిన 6 ల‌క్ష‌ల బ్యాలెన్స్ ఇచ్చేస్తాను. నాకు సినిమాపై న‌మ్మ‌కం ఉంది. ఆమె ప్ర‌చారం చేయ‌క‌పోయినా హిట్ అయితే జ‌నాల్లోకి వెళ్తుంది.

సినిమాలో త‌న పాత్ర గొప్ప‌గా వ‌చ్చింది. సినిమాలో కొత్త పాయ‌ల్ రాజ్ పుత్ ని చూస్తారు. పాయ‌ల్ ఇమేజ్ నే మార్చేసే సినిమా ఇది` అన్నారు. దీంతో నిర్మాత -పాయ‌ల్ రాజ్ పుత్ మ‌ధ్య అగ్రిమెంట్ విష‌యంలో చిన్న‌పాటి పొర‌పాట్లు దొర్లిన‌ట్లు సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. సినిమాకి కేటాయించిన డేట్ల‌తో పాటు ప్ర‌చారానికి క‌లిపి నిర్మాత‌లు పారితోషికంగా మాట్లాడిన‌ట్లున్నట్లు నిర్మాత వెర్ష‌న్ లో క‌నిపిస్తుంది. కానీ పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌చారంతో ప‌ని లేకుండా సినిమాకి క‌మిట్ అయిన‌ట్లు? ఆమె వెర్ష‌ల్ లో తెర‌పైకి వ‌స్తుంది.