రజనీకాంత్ పై రాధిక సంచలన వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ పై సీనియర్ నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేసారు. అతనో బోరింగ్ పర్సన్ అని..ఎక్కువగా ఎవరితో మాట్లాడరని..తన పని అయిపోయిన తర్వాత ఓ మూలన కూర్చుంటాడు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టిం హాట్ టాపిక్ గా మారాయి. ఎంత సహచర నటుడైతే మాత్రం ఇంతలా రియాక్ట్ అవ్వాలా? అంటూ ఫ్యాన్స్ నవ్వేస్తున్నారు.

ఇంతకీ రాధిక సూపర్ స్టార్ పై ఎందుకలా మాట్లాడినట్లు? ఎప్పుడు సైలెంట్ గా ఉండే రాధిక ఈ రేంజ్ లో దేనికి రియాక్ట్ అయినట్లు? అంటే దానికి కారణంగా నటసింహ బాలకృష్ణ అని చెప్పాలి. ఆయన కెలకడంతోనే రాధిక అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ బాలయ్య ఏ కారణంగా కెలికినట్లు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కూడా దిగ్విజయంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే.

మొదటి ఎపిసోడ్ కి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..ఆయన తనయుడు లోకేష్ ని తీసుకొచ్చి సీజన్ -2 ని ఒక్కసారిగా అలా పైకి లేపారు. బుల్లి తెరపై ఊహించని కాంబినేషన్ అది. ఐడియా ఎవరదన్నది తెలియదుగానీ..ఆ ఎపిసోడ్ మాత్రం బ్లాక్ బస్టర్ అయంది. రాజకీయంగానూ ప్రకంపనలను సృష్టించిన ఎపిసోడ్ అది.

అటుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి- తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి ని తీసుకొచ్చారు. ఇదే షోలో నటి రాధిక కూడా సందడి చేసారు. ఈ క్రమంలోనే బాలయ్య రజినీకాంత్ గురించి అడగగా రాధిక పై విధంగా వ్యాఖ్యానించారు. రజినీకాంత్ తో నువ్వు నటించావు కదా.. అతనిలో నీకు నచ్చనిది ఏంటి? అన్న ప్రశ్నకు బధులుగా ఆమె సరదాగా అలే మాట్లాడి నవ్వేసారు. బాలయ్య సహా ప్రేక్షకుల్ని కాసేపు నవ్వించారు.

అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ గురించి అడిగితే..ఆయనకి తన ఫ్యాషన్ మీద ఫోకస్ తప్ప..మరో ధ్యాస ఉండదు. ఆయనది మరో లోకమంటూ నవ్వేసారు రాధ. ఆ ఇద్దరి స్టార్లతో రాధ చాలా సినిమాలు చేసారు. వాళ్లంగా మంచి స్నేహితులుగా మెలుగుతారు. ఆచనువుతోనే అంతా సరదాగా మాట్లాడుతుంటారు. అలాగే రజనీకాంత్ ఎక్కువగా మాట్లాడరు. ధ్యాన పిపాసి. ఆయన ఆథ్యాత్మిక విషయాలు తప్ప మిగతా కార్యక్రమాల్లో భాగం కారు. సెట్ లో ఉన్నా…ఇంట్లో ఉన్నా మనసంతా ఏటో పరుగులు తీస్తుంటుంది.