వాళ్ల మీదే ఎన్టీఆర్ గురి..?

RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ లే అని తెలిసిందే. ముందు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా వస్తుంది. జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో దేవర ఛాన్స్ ఇచ్చాడు తారక్. ముందు ఒక సినిమాగా చేయాలనుకున్న దేవర సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.

ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ తో ఎన్టీఆర్ జత కడుతున్నాడు. దేవరతో పాటుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వార్ 2 సినిమాలో కియరా అద్వాని ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఒకవేళ దీపికా కాకపోతే మరో బాలీవుడ్ హీరోయిన్ నే తారక్ కి జోడీగా సెట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేసే సినిమాలో మాత్రం కియరా అద్వానిని హీరోయిన్ గా లాక్ చేశారని టాక్. ఎలాగు సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ లు అవుతున్నాయి కాబట్టి బాలీవుడ్ హీరోయిన్స్ అయితే సినిమాకు ఇంకాస్త హెల్ప్ అవుతుందనే కారణంతో బీ టౌన్ హీరోయిన్స్ తోనే ఎన్టీఆర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

దేవర, వార్ 2, దేవర రెండో భాగం, ప్రశాంత్ నీల్ సినిమా ఇలా కమిటైన సినిమాలన్నీ పూర్తి చేశాకనే తారక్ నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలన్నీ పూర్తయ్యేసరికి 2026 దాకా టైం పట్టేలా ఉంది. సో ఎన్టీఆర్ తో సినిమా అంటే 2026 చివర్లో కానీ 2027 లో కానీ సంప్రదించాల్సిందే అని తెలుస్తుంది. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ కి తగిన కథ పడితే మాత్రం నేషనల్ వైడ్ గా తారక్ రికార్డుల గురించి చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోతున్న సినిమాలతో ఎన్టీఆర్ తన బాక్సాఫీస్ స్టామినా చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.