శ్రీరెడ్డిపై కరాటె కళ్యాణి సంచలన ఆరోపణలు

శ్రీరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు ఆమెపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించగా.. మధ్యలో కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి.. కొంచెం పద్ధతిగా పోరాటాన్ని నడిపించడంతో ఆమెకు మద్దతు లభించింది. ఇంతలోనే పవన్ కళ్యాణ్‌ను బూతు తిట్టడం ద్వారా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందామె. ఇప్పుడు శ్రీరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా సాక్ష్యాలతో ముందుకొస్తున్నారు. ఏడాది కిందట అభిరామ్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలు ఉన్నాయని.. అతడిని ఆడుకుందామని తనతో శ్రీరెడ్డి అన్నట్లుగా గాయత్రి గుప్తా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీరెడ్డి కొందరితో అసభ్యకరంగా వీడియో చాట్ చేసిన వీడియోను జీవిత బయటపెట్టింది.

తాజాగా కరాటె కళ్యాణి శ్రీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె అమెరికాలో వ్యభిచారం చేసినట్లు ఆరోపించింది. యుఎస్‌లో శ్రీరెడ్డి కొంతకాలం ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్ తీసుకుని.. అక్కడ వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించినట్లుగా ఆమె ఆరోపణలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించి ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని కల్యాణి చెప్పింది. శ్రీరెడ్డి తన లాంటి వాళ్ల మీద లేని పోని ఆరోపణలు చేసి తమను తలెత్తుకోనివ్వకుండా చేసిందని.. ఐతే ఆమె బాగోతాలన్నీ కూడా తమకు తెలుసని.. ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినంత మాత్రాన తానేమీ భయపడనని.. ఆమెకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నానని.. ఆమెను తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కళ్యాణి స్పష్టం చేసింది.