సారా అలీఖాన్ రెడ్ కార్పెట్ కోరిక ఇది!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘గ్యాస్ లైట్’..’జర్ హట్ కే జర బచ్ కే’..’యే వతన్ మేరా వతన్’ లాంటి విజయాలతో రెట్టింపు ఉత్సాహంలో కనిపిస్తుంది. టాలీవుడ్ లో మంచి అవకాశం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే రెక్కలు కట్టుకుని వాలిపోవాల ని చూస్తుంది. జాన్వీకపూర్..అలియా భట్.. కియారా అద్వాణీ లాంటి భామలు తెరంగేట్రం చేయడంతో ! ఆ ఛాన్స్ తనకెప్పుడో వస్తుందా? అని ఎదురుచూస్తుంది.

ఇక బ్యూటీ ఇటీవలే కేన్స్ చిత్రోత్సవాల్లోనూ తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై వాక్ చేసి కుర్రకారు హృదయాల్ని దోచేసింది. స్టార్ హీరోయిన్ కాక ముందే ఆరకంగా అరుదైన అవకాశం అందుకుంది.

తాజాగా కేన్స్ నుంచి తిరిగొచ్చిన అమ్మడు తన అనుభవాల్ని పంచుకుంది. ‘ప్రతీ దేశానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ..సంప్రదాయా లుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా! చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా గమనించా.

నేను అక్కడ సౌదీ అరేబియా..ఈజిప్ట్..లెబనాన్…ప్యారిస్ లకు చెందిన నటీనటులతో చాలా విషయాలపై చర్చించా. వాళ్ల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. వాళ్లు ఎంత అప్ డేట్ గా ఉంటారన్నది నాకు అప్పుడే అర్ధమైంది.

నాకెంతో ఇష్టమైన హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోని కలిసా. సంస్కృతులు ..ప్రాంతాలు వేరైనా? అందరిలో నేను గమనించిన విషయం ఏంటంటే? వాళ్లందరికీ సినిమా అంటే వల్లమాలిన అభిమానం. సినిమా కోసం ఏదైనా చేయాలనే పట్టుదల వాళ్లలో కనిపించింది. ఆ ఇష్టమే అందర్నీ దేశ సరిహద్దులు చెరిపేసి ప్రపంచంలో కళాకారుల్ని అందర్నీ ఓ తాటిపైకి తీసుకొస్తుంది’ అని అంది.

సారా అలీఖాన్ ని మీకు ఏ నటుడితో రెడ్ కార్పెట్ పై కలిసి నడవాలని ఉందని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ..హాలీవుడ్ లో ర్యాన్ గోస్లింగ్ తో రెడ్ కార్పెట్ పై నడవాలని ఉంది. ఇది నా డ్రీమ్. ఎప్పటికైనా కేన్స్ లో ఆరకంగా రెడ్ కార్పెట్ పై నడుస్తాను అన్న కాన్పిడెన్స్ నాలో ఉంది’ అని తెలిపింది.