సీఎం కేసీఆర్‌కు రూ. 10 లక్షల చెక్ అందించిన నితిన్

కరోనా వైరస్ కారణంగా దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు కష్టకాలం ఏర్పడింది. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు బాసటగా నిలబడాల్సిన సమయమిది. వరదలు వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు ఎలాగైతే ప్రభుత్వాలకు బాసటగా నిలిచేవారే.. ఇప్పుడు కూడా అలాగే సహాయం చేయాల్సిన సందర్భమిది. ఇప్పటికే హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రజినీకాంత్, సూర్య, కార్తీ, విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్ వంటి హీరోలు ఆర్థిక సాయం ప్రకటించిన వారిలో ఉన్నారు. టాలీవుడ్‌లో కూడా ఇప్పుడిప్పుడే కదలిక మొదలైంది.

హీరో నితిన్ తను ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చెక్ రూపంలో అందించడం విశేషం. ఈ విషయంలో తొలి అడుగు వేసిన హీరోగా నితిన్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తుతం ఉన్న సెల్ఫ్ డిస్టెన్స్ రూల్‌ని పక్కన పెట్టి.. ఆలింగనం చేసుకుని మరీ నితిన్‌ని అభినందించారు.