స్టార్ క్రికెటర్.. స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య వింత వార్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్ విషయం అయింది. కానీ ఒక స్టార్ హీరో మరియు ఒక స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ అనేది మొదటి సారి జరుగుతోంది.

ఐపీఎల్ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సాక్షిగా షారుఖ్ ఖాన్ మరియు విరాట్ కోహ్లీ యొక్క ఫ్యాన్స్ రచ్చ చేశారు. మొదటగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని అవమానించే విధంగా ఇప్పటి వరకు కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదంటూ అవహేళన చేశారు.

కోహ్లీ గెలవలేక పోయిన ఐపీఎల్ ను షారుఖ్ ఖాన్ సహ యజమానిగా ఉన్న నైట్ రైడర్స్ జట్టు రెండు సార్లు గెలుచుకుందని వారు సోషల్ మీడియా ద్వారా కోహ్లీ ని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు.

కోహ్లీ ఫ్యాన్స్ కూడా కౌంటర్ గా సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఆయన విరాట్ స్థాయి స్టార్ కాదంటూ కామెంట్స్ చేశారు.

ప్రపంచంలోనే బెస్ట్ నటుడు మరియు బెస్ట్ క్రికెటర్ అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తే షారుఖ్ ఖాన్ పేరు కనిపించడం లేదని… కానీ కోహ్లీ పేరు మొదటే ఉందంటూ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.

మొత్తానికి ఇద్దరు ఫ్యాన్స్ మధ్య రచ్చ మామూలుగా లేదు. బెంగళూరు.. కోల్ కత్తా మ్యాచ్ జరిగే సమయంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి.