అక్కడే నాని ఎక్కువ ఫోకస్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా. ఈ మూవీ మర్చి 30న సుమారు ఐదు భాషలలో రిలీజ్ కి రెడీ అవుతుంది.సౌత్ భాషలతో పాటు హిందీలో ఈ మూవీ రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇక మూవీ ప్రమోషన్ ని నాని స్టార్ట్ చేశాడు. అన్ని భాషలలో ప్రేక్షకులకి దసరా మూవీ కంటెంట్ ని రీచ్ చేయడానికి తన ప్రయత్నాలు చేస్తున్నాడు.

తెలుగులో నానికి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఎలా అయిన రీచ్ అయిపోతుంది. అయితే ఇతర భాషలలో ప్రేక్షకులకి కనెక్ట్ కావాలంటే కచ్చితంగా స్ట్రాంగ్ ప్రమోషన్ ఉండాలి. ఇప్పటికే హిందీ బెల్ట్ లో నాని ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. తెలుగు సినిమాలకి అక్కడ మంచి ఆదరణ ఉన్న నేపధ్యంలో పుష్ప బ్రాండ్ నార్త్ లో భాగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక తమిళ్ ప్రమోషన్ పైన నాని ప్రత్యెక దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి కల్ట్ స్టోరీస్ తమిళ్ ఆడియన్స్ కి కూడా భాగా రీచ్ అవుతాయి.

ఈ నేపధ్యంలో అక్కడ ప్రమోషన్ విషయంలో మరింత బెటర్ గా వెళ్ళాలని నాని అనుకుంటున్నారు. అందులో భాగంగా తమిళ్ మీడియాకి బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు ఇవ్వాలని నాని భావిస్తున్నాడు. అలాగే సూపర్ హిట్ సాంగ్ మన్నీరు వట్టి కట్టి తమిళ్ ఆడియన్స్ కి భాగా రీచ్ అయ్యింది. ఈ సాంగ్ తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో దీనిని గ్రాండియర్ గా షార్ట్ వీడియో యాప్స్ లో ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ముఖ్యంగా తమిళ్ షార్ట్ వీడియో ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సాంగ్ ని ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయించాలని చూస్తున్నారు. అలాగే ఎక్కువగా ఈ సినిమాని తమిళ్ మార్కెట్ లోకి రీచ్ అయ్యేలా చేయడం ద్వారా అక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ కావచ్చని నాని ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ ప్రమోషన్ తో దసరా సినిమాతో తమిళ్ మూవీ మార్కెట్ లోకి ఏ మేరకు తీసుకొని వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.