అజ్ఞాతవాసి-ఆడియో-అమరావతి

అదిగో ఆడియో అంటే ఇదిగో అమరావతి అనేట్లు వుంది వ్యవహారం. ఇప్పుడు అజ్ఞాతవాసి ఆడియో కూడా అమరావతిలో అంటూ గ్యాసిప్ లు పుట్టుకువచ్చాయి. కానీ ఇది పక్కా గ్యాసిప్ నే. నిజమే కాదు. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లోనే. ఇలాంటి గ్యాసిప్ లు ఎందుకు పుడతాయంటే , ఒకటే కారణం. పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్ లు చేయడానికి వేదిక అన్నది పెద్ద సమస్యగా మారింది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు అడ్డం పడతాయి. మైదానాలు అంటే కుర్చీలు వేయాలి. కుర్చీలు వేస్తే జరిగే డ్యామేజ్ చాలా రకాలుగా వుంటోంది. ఆంధ్రలో కూడా విశాఖ, విజయవాడల్లో అంత పెద్ద స్టెడియంలు అందుబాటులో లేవు. ఇక అమరావతి అంటే వేల ఎకరాలు సేకరించి వుంచారు. అంతా ఖాళీనే.

కానీ, అజ్ఞాతవాసి ఆడియో మాత్రం హైదరాబాద్ లోనే. ఎక్కడన్నది ఒకటి రెండు రోజుల్లో డిసైడ్ అవుతుంది. పవన్ కేవలం హీరో మాత్రమే కాదు. పొలిటికల్ పార్టీ నాయకుడు కూడా. అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే చాలా తేడా వచ్చేస్తుంది.

అలా అని లిమిటెడ్ ఇన్వైటీస్ తో నాలుగు గోడల మధ్యన చేస్తే, ఫ్యాన్స్ ఫీలవుతారు. అమరావతి లో చేయడానికి కూడా ఓ సమస్య వుంది. అమరావతి లో ఏర్పాట్లుకు కనీసం ఓ పది రోజులు దృష్టి పెట్టాలి. పైగా డజను లారీల సామాను ఇక్కడి నుంచి అక్కడికి పంపాలి. ఇవన్నీ పెద్ద తలకాయనొప్పి. అసలే డిసెంబర్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వున్నాయి. యూనిట్ ఇవే చూసుకుంటుందా? అమరావతి వెళ్తుందా? అన్నది సమస్య.

అందుకే హైదరాబాద్ లో వెన్యూ వెదుకుతున్నారని వినికిడి. ఒకటి రెండు రోజుల్లో అది కూడా ఫైనల్ అవుతుంది.