అర్జున్ రెడ్డికి అమ్మాయి కావాలి

అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో వర్మ పేరుతో రాబోతున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై నిన్నటివరకు ఉత్కంఠ కొనసాగింది. తెలుగు అర్జున్ రెడ్డిలో నటించిన షాలిని పాండేనే రిపీట్ చేస్తారని కొందరన్నారు. ఇదే లిస్ట్ లో హెబ్బా పటేల్ పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ వీడింది.

వర్మ సినిమాలో ధృవ్ సరసన హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. డెబ్యూ హీరో సరసన కొత్త ఫేస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చారు. ఓ అందమైన అమ్మాయి వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు విక్రమ్. ఆ వీడియోలో అమ్మాయి ముఖం కనిపించదు. అమ్మాయి లక్షణాల్ని మాత్రం వివరించారు.

ఇలాంటి క్వాలిటీస్ మీలో కూడా ఉంటే వెంటనే మీ ఫొటోస్ తో పాటు డీటెయిల్స్ మెయిల్ చేయమని కోరాడు విక్రమ్. వీలైనంత తొందరగా హీరోయిన్ ను ఎంపిక చేస్తామని, ఆలస్యం చేయొద్దని కోరాడు. ఈ వీడియోకు అద్భుతమైన గాత్రాన్ని అందించిన హీరోయిన్ శృతిహాసన్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పాడు విక్రమ్.