అలనాటి అందాలు

నిన్నటి తరం అందాలన్నీ ఒకేసారి కళ్ల ముందుకు వస్తే..? వయసు మీదపడి, అత్తపాత్రలు వేస్తే వేస్తూ వుండొచ్చు కానీ, 80వ దశకం నాటి హీరోయిన్లు ఇంకా మన సినిమా ప్రేక్షకుల కళ్ల ముందు నుంచి పోలేదు. అత్తపాత్రల్లో అలా వుంటున్నారు కానీ, మేకప్ కొట్టి, మాంచి డ్రెస్ లు వేస్తే వాళ్లకు ఎవరుసాటి. ఈ ఫొటో అదే చెబుతుంది.

1980 నాటి హీరోయిన్లంతా ఇటీవల మద్రాసులో సమావేశం అయ్యారు. హాయిగా టైమ్ స్పెండ్ చేసారు. ఊదారంగు షేడ్ లో డ్రెస్ కోడ్ పెట్టుకుని, రకరకాల డ్రెస్ లు వేసుకుని, ఫుల్ మేకప్ తో వున్న అలనాటి హీరోయిన్ల మీద ఓ లుక్కేయండి.