ఆ సినిమా మరో ఆదిత్య 369?

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సృష్టి ఆదిత్య 369. అదే సబ్జెక్ట్ ను ఈ రోజుల్లో అయితే పాన్ ఇండియా సినిమాగా వందల కోట్లలో తీస్తారేమో? సింగీతం కూడా దానికి సీక్వెల్ చేయాలని అంటున్నారని బాలకృష్ణ నోట చాలా సార్లు వినిపించింది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. కాదు కూడా.

కానీ మరో రూపంలో ఆదిత్య 369 లాంటి సినిమా రాబోతోందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా ఇలాంటి వ్యవహారమే అని తెలుస్తోంది. అంటే సినిమాలో అటు అలనాటి చక్రవర్తుల కాలం, అలాగే ఫ్యూచర్ ఫాంటసీ కూడా కలిసి వుంటాయని టాక్. కథ ముందుకు వెనక్కు కూడా వెళ్లి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ స్క్రీన్ ప్లే మాత్రం వేరుగా వుంటుందని తెలుస్తోంది. అంటే ఒకేసారి ముందు వెళ్లడం, ఒకేసారి వెనక్కు వెళ్లడం లాంటివి కాదు అన్నమాట.

ఫుల్ యాక్షన్

ఇదిలా వుంటే ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ గా వుంటుదట. ఫైట్లు చాలా కీలకంగా వుంటాయట. దర్వకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను 80శాతం వరకు గ్రీన్ మ్యాట్ లోనే తీస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది లో రెండు సార్లు 15 రోజుల వంతున ప్రభాస్ డేట్ లు ఈ సినిమాకు కేటాయిస్తున్నారు. ఈ ముఫై రోజుల్లో కూడా ప్రభాస్ చేయబోయే గ్రీన్ బ్యాక్ డ్రాఫ్ ఫైట్లనే చిత్రీకరిస్తారట. అలా అయితే సిజి వర్క్ కు కంటెంట్ ముందుగా పంపేయవచ్చు అని ప్లాన్ చేస్తున్నారు.