ఆ హీరోయిన్ బాగా సెన్సిటివ్ అంట

ఒక్కొక్కళ్లు ఒక్కోలా వుంటారు. కొందరు రిజర్వ్ గా వుంటారు. కొందరు కలుపుకోరుగా వుంటారు. కొందరు కాస్త అటాచ్ మెంట్ వస్తే చాలా అభిమానించేస్తారు. తాజగా ఇండస్ట్రీలో ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసి, మరో రెండు మూడు మంచి అవకాశాలు అందుకున్న ఓ హీరోయిన్ కు ఓ బలహీనత వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు హీరోయిన్ ఇట్టే ఎవరో ఒకరితో కొండంత అభిమానంలో పడిపోతుందట.

మొదట ఓ సినిమా చేసినపుడు, ఆ సినిమాకు పనిచేసిన బక్కపల్చని కుర్ర డైరక్టర్ తో పీకల్లోతు స్నేహంలో మునిగిపోయిందట. అది ప్రేమే అని కూడా అనుకున్నారట యూనిట్. కానీ అంతలో మరో మీడియం రేంజ హీరో సినిమా చేస్తున్నపుడు ఆ సినిమా డైరక్టర్ తో మళ్లీ అదే రిపీట్ అయిందట. ఈ వ్యవహారంలో పడి ఆ సినిమా లేటయింది. ఇంకా విడుదల కూడా కాలేదనుకోండి.

ఇంతలో లక్కీగా మరో పెద్ద హీరో పెద్ద సినిమా వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా ఆ అమ్మాయి ఓ కీలక వ్యక్తితో పీకల్లోతు అభిమానంలో మునిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఆ అమ్మాయి తరహా మాత్రమే అని, వయసు గట్టిగా రెండు పదులే కావడంతో, అవతలి వారి మాటలు నమ్మి, ఇట్టే అభిమానించేస్తుందని కూడా అంటున్నారు. అన్నట్లు అదే అమ్మయికి మరో పెద్ద హీరో ప్రాజెక్టు దొరికింది. అక్కడ పరిస్థితిపై ఇంకా గుసగుసలు స్టార్ట్ కాలేదు.