ఏ హీరోతోనూ సెక్స్‌సంబంధం లేదంది!

ఒకవైపు సోనమ్ కపూర్ పెళ్లి జరుగుతుంటే, ఆమె గత ప్రేమ వ్యవహారాలను, గతంలో ఆమె చేసిన కామెంట్లను ప్రస్తావించే పనిలో పడింది బాలీవుడ్ మీడియా. గతంలో సోనమ్‌కు రణ్‌బీర్ కపూర్‌తో చిన్నపాటి ప్రేమకథ ఉండేదని మీడియా గుర్తు చేస్తోంది. సోనమ్ పెళ్లి చేసుకుంటున్న తరుణంలో రణ్‌బీర్ ఎక్కడున్నాడో వెదుకుతోంది మీడియా.

రణ్‌బీర్, సోనమ్ కపూర్‌ ఇద్దరూ ఒకే సినిమాతో కెరీర్ ఆరంభించారు. అదే ‘సావరియా’. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ కళాఖండం అప్పట్లో భారీ అంచనాల మధ్యన వచ్చి సో.. సో.. అనిపించుకుంది. అయితే రణ్‌బీర్, సోనమ్‌ల గ్రాండ్ లాంఛింగ్‌కు మాత్రం ఈ సినిమా బాగా ఉపయోగపడింది.

అప్పట్లో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు అయితే వచ్చాయి. వాటిని ఈ హీరోహీరోయిన్లు ధ్రువీకరించలేదు. ఆ సంగతలా ఉంటే, కొన్నాళ్ల కిందట సోనమ్ కపూర్ ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ సంబంధాల గురించి స్పందించిన విషయాలను మీడియా ఇప్పుడు ప్రస్తావిస్తోంది.

తనకు ఏ హీరోతోనూ సెక్సువల్ రిలేషన్ షిప్ లేదని ఆ ఇంటర్వ్యూలో సోనమ్ కుండబద్ధలు కొట్టి చెప్పింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇష్టమైన సెక్స్ యాంగిల్ గురించి కూడా చెప్పేస్తుంటే సోనమ్ మాత్రం, ఎవ్వరితోనూ అలాంటి బంధంలేదని స్పష్టం చేసింది.

తను పనిచేసిన హీరోలతో అలాంటి సంబంధాలు పెట్టుకోవడం అనైతికం అని తనకు అనిపించిందని సోనమ్ వివరించింది. వారికి వేరే బంధాలున్నప్పుడు వారితో సంబంధం ఏర్పరుచుకోవడం అనైతికమే కదా? అని కూడా సోనమ్ ప్రశ్నించింది అప్పట్లో. వివాహం నేపథ్యంలో సోనమ్ చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.