కనీసం ఈసారైనా హిట్ కొడతాడా..?

రెండు పడవలపై కాలుపెట్టి ప్రయాణం చేయకూడదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ సందీప్ కిషన్ వినలేదు. రెండు భాషల్లో సినిమాలు చేశాడు. ఎటూ కాకుండా పోయాడు. ప్రస్తుతం అతడు తమిళ్ లో సినిమా చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడో.. లేక తెలుగు, తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా సినిమాలు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎలా చేసినా రెండు భాషల్లో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఇదే.

స్ట్రయిట్ గా చేసిన నక్షత్రం లాంటి సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. తమిళ్ నుంచి తీసుకొచ్చి విడుదల చేసిన నగరం లాంటి సినిమాలు బాగున్నా ఆడడం లేదు. ఎందుకంటే అందులో నేటివిటీ మిస్ అవుతోంది. ఇలా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో సక్సెస్ కు దూరమయ్యాడు సందీప్ కిషన్.

ప్రస్తుతం ఈ కుర్రహీరో చేతిలో 4 సినిమాలున్నాయి. కానీ ఏ మూవీపై బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అందులో ఒకటి కేరాఫ్ సూర్య. సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కు కూడా రెడీ అయింది ఈ సినిమా. నాని, రకుల్, కాజల్ లాంటి సెలబ్స్ తో ప్రచారం కూడా చేస్తున్నారు.

కానీ ఎవరూ దీని గురించి మాట్లాడుకోవడం లేదు. మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైమ్ లో గట్టి కంటెంట్ ఉంటే తప్ప సందీప్ కిషన్ నిలబడ్డం కష్టం. అలాంటి నికార్సైన కంటెంట్ కేరాఫ్ సూర్యలో ఉంటుందా అనేది డౌట్.