కాస్టింగ్ కౌచ్: రోజా Vs శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ యుద్ధం ఇప్పుడు రోజా, శ్రీరెడ్డి మధ్యకు మారింది. తను కామెంట్ చేసిన ఓ హీరోను రోజా వెనకేసుకురావడంపై శ్రీరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇంకొన్ని రోజులాగితే ఇండస్ట్రీ బాగోతం మొత్తం బయటపెడతానని, రోజా కాస్త ఓపిగ్గా వెయిట్ చేయాలని అంటోంది. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా? రోజా గారు బాగానే కవరింగ్ లు ఇస్తున్నారు. 27ఏళ్లు అయిందంట ఆమె పరిశ్రమకొచ్చి. ఆమెను ఎవరూ కెలకలేదంట. మీరు ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి. ఇండస్ట్రీ మీద నేను బురద వేశానా? మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది. నాతో వద్దు నీ లొల్లి.”

రోజాపై శ్రీరెడ్డి రియాక్షన్ ఇది. రిపోర్ట్ రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరి బండారం బయటపెడతానంటోంది శ్రీరెడ్డి. ఇంత సెడన్ గా రోజాపై శ్రీరెడ్డి ఫైర్ అవ్వడానికి కారణం ఉంది. నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ లో హీరో రాజశేఖర్ ను రోజా వెనకేసుకొచ్చారు.”రాజశేఖర్ ఇండస్ట్రీకొచ్చి ఎన్నేళ్లవుతుందో అందరికీ తెలుసు. నేను రాజశేఖర్ గారితో 2 సినిమాలు చేశాను. జీవిత లేనిదే ఆయన ఎక్కడికీ వెళ్లరు. అలాంటి మనిషి తప్పు చేశాడంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.”

రోజా చెప్పిన ఈ మాటలే శ్రీరెడ్డికి కోపం తెప్పించాయి. ఓవైపు రాజశేఖర్ స్త్రీలోలుడంటూ తను విమర్శలు చేస్తుంటే.. అతడికి రోజా క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడం శ్రీరెడ్డికి నచ్చలేదు. అందుకే రోజాపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. రాజశేఖర్ కు స్వయంగా ఆమె భార్య జీవిత, అమ్మాయిల్ని సరఫరా చేసేవారని, దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని గతంలో శ్రీరెడ్డి ఆరోపించింది.