కొరటాల మార్పులు నిజమేనా?

ఇప్పటి దాకా దర్శకుడు కొరటాల శివ చేసిన సినిమాల కథలు అన్నీ ఆయనవే. ఆయన స్వంతం. అయితే శ్రీమంతుడు మీద చిన్న వివాదం వుంది కానీ అది కోర్టు తేల్చాల్సి వుంది. కానీ ఇప్పుడు రాబోయే భరత్ అనే నేను సినిమా కోసం కొరటాల వేరే వాళ్ల కధ హక్కులు తీసుకున్నారు. గతంలో ఎప్పుడో ఓ ఫెయిల్యూర్ సినిమా డైరక్ట్ చేసిన ఒకరి దగ్గర నుంచి ఈ కథను కొరటాల తీసుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ కథను స్క్రిప్ట్ గా మార్చి, మాటలు తయారుచేసుకున్నారు తప్ప, పెద్దగా మార్పులు చేయలేదని వినికిడి. కానీ స్పైడర్ సినిమా తరువాత ఎంటర్ టైన్ మెంట్ పార్ట్, ఎమోషనల్ పార్ట్ లను చెక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు మించి మరీ పెద్దగా మార్పులు ఏవీ చేయలేదని వినికిడి.

కానీ లీడర్ సినిమా టైపులో వుంటుంది. లవ్ స్టోరీ, తండ్రి చనిపోతే కొడుకు సిఎమ్ కావడం వంటి పాయింట్లు బయటకు గ్యాసిప్ లు గా వినిపించాయి. దీంతో బయ్యర్లకు అనుమానం వచ్చింది. దీంతో కొరటాల శివ స్క్రిప్ట్ ను భయంకరంగా మార్చేసారని, పూల్ ఫ్రూవ్ గా తయారుచేసారని ఫీలర్లు యూనిట్ నుంచే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.