గ్లామరున్నప్పుడే ఛాన్సులు కొట్టెయ్యాలి.!

కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కన్పించిన రష్మికి, స్టార్‌డమ్‌ని తీసుకొచ్చింది బుల్లితెర. ‘జబర్‌దస్త్‌’ షో ఆమెకి ఇచ్చిన స్టార్‌డమ్‌ అలాంటిలాంటిది కాదు.! అంతే, బుల్లితెర నుంచి వెండితెరకు మళ్ళీ ప్రమోట్‌ అయ్యింది రష్మి. ఈసారి గతంలోలా కాదు, హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనే స్థాయిలో వెండితెరపై రెచ్చిపోయింది రష్మి. ఏదైనా బోల్డ్‌గా మాట్లాడేయడం అలవాటు చేసుకుందీ బ్యూటీ.

‘గుంటూరు టాకీస్‌’ సినిమా కోసం ఓ లిప్‌ లాక్‌ సన్నివేశం అనుకున్నారు. ఆ సీన్‌ని చెప్పడానికీ ఇబ్బంది పడ్డారట దర్శకుడు, నిర్మాత. ఎలాగోలా సీన్‌ చిత్రీకరించేశారు. కానీ, అనుకున్నదాంట్లో 30 శాతం మాత్రమే చిత్రీకరించారట. దానర్థమేంటి.? అంతకన్నా హాట్‌గా ఆ సీన్‌ చిత్రీకరిద్దామనుకున్నట్టే కదా.! అంత బోల్డ్‌గా చెప్పగలగడమంటే చిన్న విషయం కాదు.

ఇక, ‘గ్లామరున్నప్పుడే ఛాన్సులు కొట్టెయ్యాలి.. ఇంకో ఐదేళ్ళ తర్వాత ఎక్స్‌పోజింగ్‌ చేస్తానంటే నన్ను చూసేవారెవరు.?’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటుంది రష్మి. ఈ మధ్య ఎందుకో, గ్లామర్‌తోపాటు పెర్ఫామెన్స్‌ కూడా వుండాలని కాస్త రూట్‌ మార్చినట్లు కన్పించినా, మళ్ళీ హాట్‌నెస్‌ అంటేనే తనకిష్టమంటూ ఇంకోసారి క్లారిటీ ఇచ్చేసింది.

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే రష్మి నటించిన సినిమాల్లో ఆమె క్యారెక్టర్‌ ఎలివేట్‌ అవడం, అలా రష్మికి గుర్తింపు దక్కడం తప్ప, ఆయా సినిమాలు విజయవంతమై, రష్మి స్టార్‌డమ్‌ ఇంకాస్త పెరగడం అనేది మాత్రం పెద్దగా కన్పించడంలేదు. బహుశా ఆమె ఎంచుకుంటున్న సినిమాల వల్లనే ఈ సమస్య పుట్టుకొస్తోందేమో.!