చైతూ, సమ్.. కొత్తగా పెళ్లైన ఎగ్జయిట్‌మెంట్ లేదా!

కొత్తగా పెళ్లైన వాళ్లు.. పరస్పరం దగ్గరగా గడపాలని తపించిపోవడం అసహజం కాదు. కొత్త పెళ్లైనప్పుడు ఉంటే ఎగ్జయింట్ మెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాతిక, ముప్పై యేళ్ల వయసులో జరిగే పెళ్లి.. అన్నేళ్ల యవ్వన్నపు చిలిపితనానికి ఆనకట్టలు తెంచేస్తుంది. టీనేజ్ లో మొదలైన ఎగ్జయింట్ మెంట్ కు ఫీలింగ్స్ అన్నింటికీ పెళ్లి ప్రాక్టికలిటీగా నిలుస్తుంది. సైన్స్ అనండి.. రొమాన్స్ అనండి.. కామన్ ఫీలింగ్స్ అనండి.. ఏమన్నా.. పెళ్లి అయిన తర్వాత ఆస్వాదించదగినవి ఎన్నో ఉంటాయి.

వాటి కోసం అన్నింటి నుంచి విరామం తీసుకోవడం మనిషి సహజ లక్షణం. సృష్టిలో ఉద్యోగం చేసేది మనిషి మాత్రమే… వృత్తి కోసమనో ఉద్యోగం కోసమనో బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ కు కూడా ప్రత్యేకంగా సమాయాన్ని కేటాయించుకుంటాడు. అలాంటివి తీర్చుకోవాల్సిన సమయంలో పని నుంచి మినహాయింపునో, గ్యాప్ నో.. తీసుకుంటాడు. ఇవన్నీ ఉపోద్ఘాతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ.. నాగచైతన్య, సమంతలు మాత్రం.. వీటన్నింటికీ మినహాయింపుగా కనిపిస్తున్నారు. పెళ్లి అయిన మరునాటి నుంచినే వీళ్లు పనుల్లో పడిపోయారు! పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవరైనా.. తమ పనుల నుంచి కనీసం వారం రోజులైనా దూరంగా ఉంటారు. ఏ హనీమూన్ ట్రిప్పో పెట్టుకుంటారు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్.

కానీ సమంత, నాగచైతన్యలు తమ వృత్తితో బిజీ అయిపోవడాన్నిచూస్తుంటే.. ఏంటబ్బా.. వీళ్లు, అని అనంతపురం నుంచి అనకాపల్లి వరకూ కామన్ ఆడియన్స్ చెవులు కొరుక్కొంటున్నారు. ఎంతైనా సెలబ్రిటీలు కదా.. వీళ్ల గురించిన ప్రతి వ్యవహారం జనాలకు అత్యంత ఆసక్తికరమే. అదీ ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే.. దీని గురించి జనాలు ఎన్నాళ్లు మాట్లాడుకుంటారో వేరే చెప్పనక్కర్లేదు కదా. సమంత, చైతూ ఎక్కడికైనా హనీమూన్ కు వెళ్లి ఉంటే.. అది వార్తే.

వాళ్లు ఎక్కడకూ వెళ్లకుండా సినిమా పనుల్లో పడిపోయారు కాబట్టి.. ఇది అంతకన్నా పెద్ద ఆశ్చర్యం జనాల పాలిట. కానీ.. ఇలాంటి బేసిక్ డౌట్స్ కు సమంత ఏనాడో సమాధానం ఇచ్చింది. ‘పెళ్లి కేవలం సంప్రదాయం కోసం, అందరి కోసం చేసుకున్నది మాత్రమే.. మా ఆలోచనల్లో, మా మదిలో ఏనాడో మేం భార్యభర్తలం అయిపోయాం..’ అని. కాబట్టి.. హనీమూన్, కొత్తగా పెళ్లి.. అనే వ్యవహారాలకు ఇప్పుడు తావేమీ లేదేమో! ‘సెక్స్’ విషయంలో సమంత ఇది వరకూ ఓపెన్ గా చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ పెళ్లి అనేది కేవలం సమాజం కోసం, ఇంట్లో వాళ్ల కోసం చేసుకున్నదే!