నాగ్-నాని సినిమాకూ అదే ఆలోచన

ఎక్కడో ఏ కొరియన్ సినిమా డీవీడీనో దొరుకుతుంది. అయిడియా బాగుంది కదా అని ఫాలో అయిపోతారు. ఇది టాలీవుడ్ లో కామన్. మొన్నటికి మొన్న రంగస్థలంలో ఓ నావెల్ పాయింట్ వుంది. శతృవు జబ్బుపడితే, కాపాడి మరీ పగతీర్చుకోవడం. ఇప్పుడు అలాంటి పాయింట్ నే మరో సినిమాకు కూడా వాడుతున్నారని తెలుస్తోంది.

నాగ్-నాని హీరోలుగా అశ్వనీదత్ నిర్మించే సినిమా కథలో కూడా ఈ లైన్ వుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని డాక్టర్ గా కనిపిస్తారట. నాగార్జున ఓ పేషెంట్ ను తీసుకువచ్చి నాని ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు. ట్రీట్ మెంట్ చేసి, బాగయిన తరువాత మళ్లీ నాగ్ నే చంపబోతాడట. ఎందుకు చంపబోయాడు, అసలు కథేంటీ అన్నది మిగిలిన సినిమాగా తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సారథిలో ఓ భారీ హాస్పిటల్ సెట్ కూడా వేస్తున్నారు. ఈ సెట్ లో చాలావరకు సినిమా షూట్ చేస్తారని తెలుస్తోంది. భలే మంచిరోజు, శమంతకమణి లాంటి ఏవరేజ్ సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీ స్టారర్ కు దర్శకుడు.