నిహారికతో పెళ్లిపై నాగశౌర్య క్లారిటీ

నాగశౌర్య, నిహారిక కలిసి ఓ సినిమా చేశారు. ఆ టైమ్ లో వాళ్లిద్దరిపై ఎలాంటి పుకార్లు రాలేదు. అయితే ఈమధ్య వీళ్లిద్దరిపై రూమర్లు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే నిహారిక, నాగశౌర్య పెళ్లి చేసుకుంటారని, రెండేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఇంగ్లిష్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై నాగశౌర్య రియాక్ట్ అయ్యాడు.

“నిహారిక, నేను పెళ్లి చేసుకుంటామంటూ వార్తలు వస్తున్నాయి. మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. వేరే ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. రాత్రి కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. నేను షాక్ అయ్యాను. ఈ మేటర్ ఎంత దూరం వెళ్తుందో.. ఏం జరుగుతుందో చూడాలి. నిహారిక మాత్రమే కాదు, నాకు ఏ హీరోయిన్ తో సంబంధం లేదు.”ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందంటున్నాడు నాగశౌర్య. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే 3-4 ఏళ్ల తర్వాతే చేసుకుంటానని, అది కూడా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు.

అయితే నాగశౌర్య చెప్పినంత సింపుల్ గా బయట వ్యవహారం లేదు. మొన్నటికిమొన్న ఛలో సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏకంగా చిరంజీవి గెస్ట్ గా రావడానికి నాగశౌర్య-నిహారిక మధ్య బంధమే కారణమంటూ వార్తలొచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ జంట బయట ఎంత క్లోజ్ గా ఉంటుందనే విషయం మీడియాతో పాటు సినీజనాల్లో కూడా చాలామందికి తెలుసు.ఒక విధంగా వీళ్లిద్దరిదీ లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరూ ఖండించినా, ఓ ఏడాది గ్యాప్ తర్వాత నాగశౌర్య మెగా అల్లుడుగా మారడం ఖాయమంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.