పవన్ కల్యాణ్ ను కూడా వదలని శ్రీరెడ్డి

రోజుకో లీకుతో సంచలనం సృష్టిస్తోంది శ్రీరెడ్డి. సురేష్ బాబు కొడుకు, హీరో రానా సోదరుడితో చనువుగా ఉన్న స్టిల్స్ ను లీక్ చేసి సంచలనం సృష్టించిన ఈ నటి, తాజాగా కోన వెంకట్ పై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంలోకి పవన్ కల్యాణ్ ను కూడా లాగింది శ్రీరెడ్డి.

“పవన్ కల్యాణ్ గారు సభలు పెట్టి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ పవన్ కల్యాణ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇండస్ట్రీ నుంచి పైకి వచ్చారు. ఇండస్ట్రీ నుంచే పేరు వచ్చింది. పరిశ్రమలో ఉన్న సమస్యల్ని పవన్ పట్టించుకోవాలి. ప్రజల సమస్యల గురించి స్టేజ్ మీద పవన్ ఓ స్థాయిలో ఉపన్యాసాలు దంచేటప్పుడు, ప్రపంచవ్యాప్తంగా నలుగుతున్న ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య పవన్ చెవులకు వినిపించలేదంటే నేను నమ్మను. పవన్ ఓసారి మాట్లాడి తీరాలి.”

శ్రీరెడ్డి డిమాండ్ ఇది. పవన్ ఇప్పుడు పరిశ్రమను వదిలేశారు కాబట్టి దానివైపు చూడను అనడం కరెక్ట్ కాదని అంటోంది శ్రీరెడ్డి. తన వ్యవహారంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుంటేనే తనకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని అంటోంది. పవన్ వచ్చి కాస్టింగ్ కౌచ్ పై సందేశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

త్వరలోనే మరి కొంతమంది ప్రముఖుల బాగోతాల్ని బయటపెడతానంటోంది శ్రీరెడ్డి. మీడియా ఛానెల్ లో సుదీర్ఘంగా జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఈ నటి, తన వద్ద ఉన్న చిన్న చిన్న ఆధారాలతోనే న్యాయపోరాటం కూడా చేస్తానని చెబుతోంది.