పవన్ జంధ్యం వేసుకుంటున్నారా?

జంధ్యం అంటే చాలా మందికి తెలిసినదే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు వేసుకుంటారు. వీరిలో బ్రాహ్మణ, వైశ్యులు సదా జంధ్యం ధరిస్తారు. క్షత్రియులు పుణ్యకార్యాలప్పుడు మాత్రం ధరిస్తారు. బ్రాహ్మణులు జంధ్యం వేసుకొవడమే కాకుండా సంధ్యా వందనాలు ఆచరిస్తారు.సరే, కాలాలు మారుతున్నాయి. ఇవ్వాళ రేపు, చాలామంది బ్రాహ్బణులు కూడా జంధ్యం వేసుకోవడం లేదు. ఇలా జంధ్యం వేసుకోవడం అంటే కేవలం మెడలో హారం వేసేసుకున్నట్లు కాదు. దానికి ఓ విధి విదానం వుంది. బ్రాహ్మణులకు ఉపనయనం వుంటుంది. తండ్రి లేదా, తాత గాయత్రీ మంత్రోపదేశం చేస్తారు. అలాగే జంధ్యం మార్చడానికి కూడా విధివిధానం వుంటుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడం? అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకుంటున్నారు. వేసుకోవడం కాదు. వేసుకునే వున్నారు. దాదాపు ఆరునెలలకు పై నుంచి ఆయన జంధ్యం ధరిస్తున్నారు. మరి ఆయన కొత్తగా ఎందుకు జంధ్యం వేసుకుంటున్నారు. దాని వెనుక అర్థం, పరమార్థం ఏమిటన్నది తెలియదు. పైగా పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన వారు. కాపు కులానికి చెందిన వారు జంధ్యం వేసుకోవడం అన్నది ఎక్కడా విన్న సంగతి కాదు.

దర్ళకుడు త్రివిక్రమ్ కు స్వతహాగా నమ్మకాలు ఎక్కువ. ఇప్పటికీ ఆయన మూడు సంధ్యలలోనూ సంధ్యావందనం చేస్తారు. ఆయన తన అలవాట్లను ఎనిమిదేళ్ల క్రితమే అన్నీ పక్కన పెట్టారు. త్రివిక్రమ్ కు ఓ గురువు వున్నారు. నరసింహం అనే ఆయనే ఇప్పుడు త్రివిక్రమ్ ద్వారా హారిక హాసిని చినబాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన ఎంత అంటే వీరికి అంత. తరచు హోమాలు చేస్తారు. ఆ హోమాల ఖరీదు ఆ రేంజ్ లోనే వుంటుంది. అదంతా వేరే సంగతి.

మరి ఆ గురువు ప్రభావమో, త్రివిక్రమ్ ఉపదేశమో కానీ పవన్ కళ్యాణ్ సుమారు ఆరునెలలు లేదా ఏడాది కాలంగా జంధ్యం ధరిస్తున్నారు. తివిక్రమ్ ఈ జంధ్యం, దాని విశిష్టత తెలియ చెప్పారని, అందుకే పవన్ జంధ్యం ధరిస్తున్నారని తెలిసింది. కానీ జంధ్యం అలా ధరించవచ్చా? దానికి ఉపనయనం లాంటిది వుండాలి కదా? అది కూడా త్రివిక్రమ్ ఏమన్నా పవన్ కు జరిపించారా? అన్నది తెలియదు.

ఇప్పుడు ఇది అంతా ఎలా బయటకు వచ్చింది అంటే, అజ్ఞాతవాసి సినిమాలో జనరల్ బాడీ మీటింగ్ కు పవన్ చుట్టూ బౌన్సర్లను పెట్టుకుని వస్తారు. ఆ సీన్ లో ఆయన బనియన్ లేకుండా కేవలం టీ షర్ట్ మాత్రం వేసుకుని వస్తారు. అక్కడ టీ షర్ట్ లోపల నుంచి లీలగా జంధ్యం కనిపించింది. ఈ వైనంపై పవన్, త్రివిక్రమ్ కు తెలిసిన వర్గాలను సంప్రదిస్తే, ఇదేమీ కొత్త విషయం కాదని, చాలా నెలలుగా పవన్ జంధ్యం ధరిస్తున్నారని తెలిసింది.

మరి పవన్ ఉట్టి జంధ్యం ధరించడమేనా? తివిక్రమ్ ప్రభావంతో సంధ్యావందనం కూడా చేస్తున్నారా? ఏమో? తెలియాల్సి వుంది.