పవన్-మహేశ్ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం

చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా దీపావళి సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఈ దసరాకు వచ్చే చిత్రాల్లో కొంతకాలంగా ప్రముఖంగా వినిపస్తున్న పేర్లు ‘హరి హర వీరమల్లు’ మహేశ్ ‘ఎస్ఎస్ఎంబీ 28’. అయితే ఈ రెండు సినిమాలు దసరాకు వస్తాయా లేదా అన్నది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది.

ఎందుకంటే పవన్కల్యాణ్ అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండటం మరోవైపు ఈ చిత్రం భారీ హంగులతో తెరకెక్కడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రాని దసరాకే విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే దాదాపు 12ఏళ్ల తర్వాత మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 28. అతడు ఖలేజా తర్వాత వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం కూడా రిలీజ్ డేట్ విషయంలో గందరగోళంగా ఉంది.

గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్. కానీ మహేశ్ తండ్రి కృష్ణ హఠాన్మరణంతో చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో టార్గెట్లోపు షూటింగ్ పూర్తికావడం కష్టం కావడంతో మళ్లీ ఆగస్ట్ 11కు మార్చారని తెలిసింది. అనంతరం దసరకు రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా బరిలో హరిహర వీరమల్లు ఎస్ఎస్ఎంబీ 28కు పోటీ ఖాయమే.

మరోవైపు వచ్చే సంక్రాంతికి వరకు ఈ ఆలస్యమవుతాయా అంటే అదీ కూడా క్లారిటీ అవ్వట్లేదు. దాదాపుగా ఈ చిత్రాలను అప్పటివరకు పోస్ట్ పోన్ చేయకుండా ఉండటానికి దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఎందుంకటే వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పలువురు హీరోల సినిమాలు కన్ఫామ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 ఆర్ సీ 15 ఎన్బీకే 108 నాగార్జున కొత్త సినిమా ఇలా పలు చిత్రాలు పతకాల పండకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ చిత్రాల రిలీజ్ డేట్స్ సంక్రాంతికి కన్ఫామ్ అయితే.. ఈ పోటీలో దిగడం కష్టమని ఎస్ఎస్ఎంబీ హరిహర వీరమల్లు మేకర్స్తో మరి కొన్ని చిత్రాల మేకర్స్ జంకుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతందో.

ఇక ఎస్ఎస్ఎంబీ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో పూజాహెగ్డేతో పాటు శ్రీలీల మరో హీరోయిన్గా నటిస్తోంది. సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్కల్యాణ్ కెరీర్లోనే భారీబడ్జెట్ పాన్ ఇండియా చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో రూపుదిద్దుకుంటోంది. నిధి అగర్వాల్ నర్గీస్ ఫక్రీ అర్జున్రామ్పాల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు బెన్లాక్ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ హంగులను సమకూరుస్తున్నారు.