పవన్ సినిమా సెకండాఫ్ ఛేంజ్

తెరి సినిమాను తెలుగులో చేయాలన్నది పవర్ స్టార్ పవర్ ముచ్చట. ఆ సినిమా రైట్స్ తీసుకువచ్చి కందిరీగ లాంటి హిట్, రభస, హైపర్ ల్లాంటి డిజాస్టర్లు అందించిన డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెట్టారు. రెండు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చినా, రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి బాగానే డీల్ చేస్తాడనో, బ్యాక్ ఎండ్ లో తను వుంటాననో పవర్ స్టార్ ధీమా కావచ్చు.

అయితే ఇంతలో అదే తెరి సినిమా తెలుగులో పోలీసోడు అనే టైటిల్ తో వచ్చేసింది. అయినా పవర్ స్టార్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. అయితే ఇప్పుడు ఎందుకయినా మంచిది అని మరో పని చేసారట. మొత్తం సినిమా సెకండాఫ్ మార్చిపారేసారట. తెరి తొలిసగం అలా వుంచి మలి సగం అంతా పవన్ సూచనల మేరకు సంతోష్ శ్రీనివాస్ స్టయిల్ లోకి మార్చేసి కొత్త కథ తయారుచేసారట.

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా డిసెంబర్ లో ప్రారంభమై వచ్చే ఏడాదిలో పూర్తయి, విడుదలకు రెడీ అవుతుంది.