పుల్లెల బయోపిక్ లో మార్పులు?

బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు మెల మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సుధీర్ బాబు హీరో అని, ప్రవీణ్ సత్తారు డైరక్టర్ అని ఇప్పటి వరకు వున్నన్యూస్. ఈ విషయాన్ని ఆ ఇధ్దరూ కూడా కన్ ఫర్మ్ చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టులోకి వస్తున్న కొత్త కొత్త పార్టనర్లు, ఆ విషయాన్ని మాత్రం ప్రకటించడం లేదు. ఆ రెండు విషయాలు తప్ప, అన్నీ మాట్లాడుకున్నారు.

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లాంటి సంస్థ ఈ ఫ్రాజెక్టుకు దన్నుగా వుంది. అలాగే అబున్ డాంటియా సంస్థ సపోర్టింగ్ గా వుంది. వీళ్లందరు కలిసి గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ప్రాజెక్టు గురించి మరోసారి గుర్తు చేస్తూ డిటైల్డ్ ప్రెస్ రిలీజ్ చేసారు. అందులో ఎక్కడా డైరక్టర్ ప్రస్తావన కానీ, హీరో ప్రస్తావన కానీ లేదు.

నిజానికి డైరక్టర్ ప్రవీణ్ సత్తారు ఇటీవల మంచి హిట్ కొట్టారు. అందువల్ల అందుకోసమైనా ఈ ప్రెస్ రిలీజ్ లో ఆయన పేరు ఓ వాక్యంలోనైనా వుండి వుండాలి. కానీ ఎక్కడాలేదు. అలాగే సుధీర్ బాబు ఈ పాత్ర పోషిస్తున్నారనీ ఎక్కడా పేర్కోనలేదు.

మరి సెకండ్ థాట్ ఏమన్నా వుందా? లేక మన వాళ్ల ప్రస్తావన ఎందుకని అనుకున్నారా? లేక వేరే ఆప్షన్లు పరిశీలిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.