పూజా హెగ్డే తెలివిగా స్కిప్ కొట్టింది!

పూజ హెగ్డేకి ఇప్పుడు తెలుగులో ఎంత పాపులారిటీ ఉందొ హిందీలో కూడా అంతే డిమాండ్ ఉంది. సల్మాన్ ఖాన్ పక్కన సోలో హీరోయిన్ గా నటిస్తుందంటే ఆమె రేంజ్ ఏమిటో అర్ధమవుతోంది. ఆమెకి తమిళ చిత్ర సీమ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. సూర్య హీరోగా నటిస్తున్న ఒక చిత్రం కోసం తనని సంప్రదిస్తే డేట్స్ సరి చూసుకుని ఏ సంగతీ చెబుతానంది. అయితే ఆమె నటించేస్తోందని న్యూస్ ఇచ్చేసారు.

కానీ పూజ డైరెక్ట్ గా మీడియాని కాంటాక్ట్ చేసి దానిని ఖండించకుండా, తన ఫాన్స్ కి ట్విట్టర్ చాట్ లో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న సినిమాల షెడ్యూల్స్ చూసుకుని డిసైడ్ అవుతానని అంది. తప్పకుండా తమిళ సినిమా చేస్తాను కానీ ఎప్పుడో చెప్పలేనంది. అలా తనని లాక్ చేయాలని చుసిన వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈమాత్రం తెలివి లేకపోతే ఇండస్ట్రీలో నెట్టుకు రావడం కష్టమే మరి!