పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు గత రెండు వారాల నుండి సోషల్ మీడియాలో గుప్పుమంటోన్న విషయం తెల్సిందే. సాయి ధరమ్ తేజ్ ఇంట్లో సంబంధం చూసారని, అందరికీ అది నచ్చిందని, మెగాస్టార్ చిరంజీవి ఆమోదం కూడా పొందారని రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ త్వరలోనే పెళ్లి అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు.

దీంతో మళ్ళీ తేజ్ పెళ్లి వార్తలపై రూమర్స్ మొదలయ్యాయి. అయితే తేజ్ ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే పెళ్లి అన్న విషయాల్లో వస్తున్న రూమర్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తనను ఇంట్లో ఎప్పటినుండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని, అయితే సంబంధం చూడామని మాత్రమే చెప్పానని, ఇంకా ఎటువంటి అమ్మాయిని ఫిక్స్ చేయలేదని, అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని అంటున్నాడు.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ ను పూర్తి చేసి త్వరలోనే దేవా కట్టా చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.