ప్రకాష్ కు హ్యాండ్ ఇచ్చిన శర్వానంద్

“రాఘవేంద్రరావు గారి అబ్బాయ్ ప్రకాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ప్రకాష్ ఎలాంటి సినిమాలు హ్యాండిల్ చేస్తాడో మీకు (మీడియా) తెలుసు కదా. అతడు చెప్పిన కథ బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో త్వరలోనే చెబుతా” మహానుభావుడు సినిమా ప్రమోషన్ టైమ్ లో యాజ్ ఇటీజ్ గా శర్వానంద్ చెప్పిన మాటలివి.

అప్పుడు సినిమా ఉందని ప్రకటించిన ఈ హీరో ఇప్పుడు లేదంటున్నాడు. అవును.. ప్రకాష్ కు శర్వానంద్ దాదాపు హ్యాండ్ ఇచ్చేసినట్టే. సుధీర్ వర్మ, ప్రకాష్ సినిమాల్లో ఏదో ఒకటి ముందు స్టార్ట్ అవుతుందని తెలిపిన శర్వానంద్.. త్వరలోనే సుధీర్ వర్మ మూవీని పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు.

అయితే సుధీర్ వర్మ సినిమా తర్వాత మాత్రం ప్రకాష్ మూవీ రావట్లేదు. ఆ స్థానంలో హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చాడు శర్వానంద్. నితిన్ తో ‘లై’ సినిమా చేసిన తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న హను.. శర్వానంద్ కోసం ఓ సబ్జెక్ట్ రెడీ చేశాడు. అది బాగా కనెక్ట్ అవ్వడంతో.. ప్రకాష్ కు హ్యాండ్ ఇచ్చి హనుకు ఛాన్స్ ఇచ్చాడు శర్వానంద్.