ప్రముఖ నిర్మాత సోదరుడు మృతి

ప్రముఖ నిర్మాత పోకురి బాబురావు సోదరుడు పోకురి రామారావు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా పాజిటి అని తేలడంతో పోకురి రామారావు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామారావు శ్వాస ఇబ్బందిగా మారడంతో తుది శ్వాస విడిచారు. ఈతరం నిర్మాణ సంస్థ నిర్మించిన పలు సినిమాలకు ఈయన సహాయ నిర్మాతగా వ్యవహరించారు. గోపిచంద్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన పోకురి మృతితో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోపిచంద్ ఫ్యామిలీ శోకం లో మునిగి పోయింది.