ప్రస్తుతం ఖాళీ.. సినిమాల్లేవ్

ఖాళీగా ఉన్నావంటే ఏ హీరోయిన్ ఒప్పుకోదు. చాలా కథలు వింటున్నానని, ఏవీ పెద్దగా నచ్చడం లేదని కథలు చెబుతారు. హెబ్బా పటేల్ మాత్రం అలా అనడం లేదు. “అవును.. ప్రస్తుతం నేను ఖాళీ” అంటూ ఓపెన్ గా చెబుతోంది. ‘ఏంజెల్’ తర్వాత ఒక్క తెలుగు మూవీ ఆఫర్ కూడా రాలేదంటోంది.

“ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎవరైనా నన్ను సంప్రదిస్తారేమో చూడాలి. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అయితే నేను అనుకున్నా గ్యాప్ తీసుకోలేను. నాకైతే యాక్టింగ్ తప్ప మరేం రాదు. ప్రస్తుతం ఈ ఖాళీ టైమ్ లో జిమ్ కు వెళ్తున్నాను. ముంబయిలో ఓ కొత్తింటికి మారుతున్నాం. ఆఫర్లు రాకపోతే జస్ట్ ఇంట్లో కూర్చుంటానంతే.”

ఆ మధ్య తమిళ్ లో ఓ ఆఫర్ ఇలా వచ్చి అలా చేజారిపోయింది. మళ్లీ కోలీవుడ్ లో సినిమాలు చేయాలనుకుంటున్న హెబ్బా, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ తెలుగులో ఎందుకు ఇంత సడెన్ గా అవకాశాలు ఆగిపోయాయనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు హెబ్బా.