ప్రాజెక్ట్ కే గురించి మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా కు సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్ పని చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా కోసం మొదట మిక్కీ జే మేయర్ ను అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల సంతోష్ నారాయణన్ ని తీసుకోవడం జరిగింది. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం తాను వర్క్ చేస్తున్నట్లుగా సంగీత దర్శకుడు పేర్కొన్నాడు. ఒక అద్భుతమైన సినిమాకు తాను వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కే సినిమా యూనిట్ మొత్తం కూడా ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేస్తున్నారు. ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ టీమ్ తో వర్క్ చేస్తున్నాను. ప్రతి ఒక్క సన్నివేశం మరియు పాట కూడా అద్భుతంగా వస్తుందని పేర్కొన్నాడు.

ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో మొదటి సారి ఈమె నటిస్తోంది. అంతే కాకుండా ఆమె ప్రభాస్ కు జోడీగా కూడా ఇదే ప్రథమం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

అమితాబచ్చన్ తో పాటు ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అన్ని వర్గాల వారిని అలరించే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా యొక్క మెంటర్ గా సింగీతం శ్రీనినివాస్ వ్యవహరిస్తున్నారు.