బాధపడిన బండ్ల గణేశ్… సెటైర్స్ వేసిన నెటిజన్స్

నటుడిగా, నిర్మాతగా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. పౌల్ట్రీ బిజినెస్‌లో కూడా అడుగుపెట్టిన ఈ బడా వ్యాపార వేత్త… ప్రస్తుతమున్న పరిస్థితులతో బాగా బాధపడుతున్నాడట. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కారణంగా కోళ్ల పరిశ్రమ బాగా నష్టపోయింది. చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లు షికార్లు చేయడంతో కోడి మాంసం తినేవారి సంఖ్య భారీగా పడిపోయింది.

కొన్ని చోట్ల కిలో చికెన్ కొంటే, గజన్ గుడ్లు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి. దీనిపై ‘మా పరిస్థితి ముందుకెళ్తే గొయ్యి… వెనకకి వెళ్తే నుయ్యిలా ఉంది… కోట్లు పెట్టుబడి పెట్టాం, భయంగా ఉంది… దీయబ్బ కరోనా’ అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేశ్. అయితే నెటిజన్స్ ఈ ట్వీట్‌పై సెటర్లు వేస్తున్నారు. ‘భయం ఎందుకు బ్రో… నిన్న ఆదివారం కిలో రూ.190 అమ్మారుగా’ అంటూ ఓ వ్యక్తి రిప్లై ఇవ్వగా… ‘ఏం కాదులే అన్నా ట్రంప్‌కు ఓ కాల్ కొట్టండి… అంతా చూసుకుంటాడు’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా చికెన్ అమ్మకాలు ఘోరంగా పడిపోయినా, లాక్ డౌన్ తర్వాత పరిస్థితి మారిపోయింది. చికెన్ కొనేందుకు షాప్‌ల ముందు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. డిమాండ్‌ పెరగడంతో చికెన్ రేట్లు కూడా పెంచేశారు అమ్మకందారులు. కాబట్టి సానుభూతి కోసం బండ్ల గణేశ్ చేసిన ట్వీట్, బాగా లేటు… అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.